Home భద్రాద్రి కొత్తగూడెం మిషన్ భగీరథ లీకులు

మిషన్ భగీరథ లీకులు

Mission bhagiratha leaks

ట్రైల్ రన్‌లోనే పగులుతున్న పైపులు
మరో నాలుగేళ్లైనా నీళ్లు అందేనా
ఇంకెన్నాళ్లు ఎదురు చూపులు…

మన తెలంగాణ/దుమ్ముగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ లో భాగంగా పర్ణశాల క్రాస్ రోడ్ వద్ద రూ. 44 కోట్లతో పనులు ప్రారంభమై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా అధికార్లు నిర్లక్షంగా వ్యవహరించడంతో ఎక్కడ చూసినా అంతా అవినీతి కంపు కొడుతోంది. ఉన్నతాధికారులు పరిశీలిన చేసే సమయంలోమాత్రమే పనులు జరగుతాయి. ఆ తరువాత రోజుల్లో పనుల్లో తీవ్ర జ్యాప్యం ప్రదర్శిస్తారు. ఈప్రాజెక్టు ముందుగా రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉండగా నులు పూర్తి అవ్వలేదనే సాకుతో సమయాన్ని పొడిగిస్తున్నారు. పనులు నిర్వహిస్తున్న సమయంలో అధికారులు పరిశీలించక పోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా పనులున్నాయి. తాజాగాపైపులైన్ల నిర్వాహణ సమయంలో అధికారుల పర్యవేక్షలోపించడంతో సదరు కాంట్రాక్టర్లు ఇష ్టమొచ్చినట్లు పైపులు వేశారు. ప్రస్తుతం ట్రైల్ రన్‌లో ఎక్కడికక్కడ పైపులు పగిలిపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పనులు పూర్తిఅయ్యోదెన్నడు నీళ్లు ఇచ్చేదెపుడు అంటు పలువురు విమర్శిస్తున్నారు

పైపుల లీకులు: భగీరథ పైపులైన్ నిర్మాణ సమయంలో జరిగిన అవకతవకలుకు ఎక్కడికక్కడ పైపులు పగుతున్నాయి. ఓ ప్రణాలిక బద్దంగా కాకుండా ఇష్టారీతిన అమర్చిన పైపులైన్ పనుల వల్ల గత ఆరు నెలలగా ట్రైల్న్ పేరుతో పనుల్లో పైపులు పగిలి పోతులన్నాయి. ఓప్రక్క ప్రభుత్వం వచ్చే ఎన్నికల కల్ల ఇంటింకీ నల్లా నీరుల అందిచక పోతే ఓట్లు అడిగే ప్రసక్తే లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ చూస్తున్న పనులు పరిశీలిస్తే మాత్రం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న ప్రజల కళ నెరవురుతుందా…. అనే ప్రశ్న అన్ని వర్గాల ప్రజల్లో చర్చించనీయంగా మారింది. తాజాగా కె.లక్ష్మీపురం గ్రామంలోపైపు లైన్ పనులు చేపట్టగా సరైన పద్దతిలో పనులు జరగక పోవటంతోట్రైల్ రన్‌లో పైవులు పగిలి నీళ్లు ఎగిసి పడుతున్నాయి. దీన్ని అదికారుల నిర్లక్షంగానే ఇలా జరగుతున్నాయని పలువురు అంటున్నారు. ఏది ఏమైనప్పడికి ప్రజల నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నవిషయమల్లా మిషన్ భగీరథ నీళ్ల ద్వారా ఇంటింటికీ నల్లా కావాలని కోరుకుంటున్నారు.