Saturday, April 20, 2024

అందరినీ అకర్షిస్తున్న మిషన్ భగీరథ ట్యాంక్

- Advertisement -
- Advertisement -
mission bhagiratha tank attracts everyone in khammam
ట్యాంక్‌పై సిఎం కెసిఆర్ చిత్రం,  సోషల్ మీడియాలో వైరల్

ఖమ్మం : ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఏది చేసినా అది వినూత్నం అవుతుంది. అంతేగాక అది ఏకంగా రాష్ట్రానికే రోల్ మెడల్ అవుతుంది. లకారం మినీట్యాంక్ అయినా, రైతు వేదికలు అయి నా, స్టేడియం అయినా, వైకుం ఠదామాలు అయినా,సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల సుందరీకర ణ అయినా, హైటెక్ గులాబీ బస్టాండ్ అయినా అది ఖమ్మం లో ప్రారంభించిన తరువాత ఇతర జిల్లాలకు మార్గదర్శకం అవుతుంది. తాజాగా మిష న్ భగీరథకు చెందిన మంచినీటి ట్యాంక్‌లు ఇప్పుడు ప్రధాన అకర్షణగా మారాయి. ఖమ్మం నగర ప్రజల దాహర్తిని శాశ్వతంగా తొలగించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం పనులు పూర్తికావోచ్చాయి.

దీనికి సంబంధించి నగర నడిబొడ్డు న్న ఉన్న అతి భారీ మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటంను ప్రముఖ చిత్రకారులచే గీయించడం ఇప్పడు ప్రధాన అకర్షణగా నిలిచింది. నగరంలోని దాదాపు 30 ఓవర్ హెడ్ ట్యాంక్‌ల పై ఈ విధంగా సిఎం కెసిఆర్ చిత్రాన్ని పెయింటింగ్ చేయనున్నారు. ప్రస్తుతం సిఎం చిత్రపటం నగర ప్రజల ను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతేగాక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకొని ఈ చిత్రాలను ప్రముఖ ఆర్టిస్ట్‌లతో గీయిస్తున్నారు. నీటి కోసం నగర ప్రజలు ఇన్నాళ్ళు పడ్డా కష్టాలు ఇకపై తొలగిపోనున్నాయని, రోజు విడిచి రోజు కాకుండా ప్రతి రోజు మంచినీటిని అందిస్తున్నామనే సందేశాన్ని ప్రజలందరికి తెలియజేసే విధంగా మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్‌లను సుందరీకరణ చేస్తున్నారు.

mission bhagiratha tank attracts everyone in khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News