Tuesday, March 21, 2023

మిషన్‌కాకతీయ పనుల్లో జాప్యం తగదు

- Advertisement -

hall*పనుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి
*ఎఫ్‌టిఎల్‌కు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు
*అధికారుల సమీక్షలో కలెక్టర్

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : మిషన్ కాకతీయ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ ఆదేశించారు. మంగళవా రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మిషన్ కాకతీయ, రోడ్లు, భవనాల శాఖ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్‌కాకతీయ 2, 3వ విడతలో పెండింగ్‌లో ఉన్న ట్యాంకుల గురించి సంబంధిత ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మిషన్‌కాకతీయ 2వ విడత పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. మండలం వారిగా అసలు పని ఎందుకు కాలేదు, దేని వల్ల ఆగింది, ఎన్ని పనులు మంజూరయ్యాయి, ఎన్నింటికి ఆర్డర్ ఇచ్చాం అని పనుల వారిగా అడిగి తెలుసుకున్నారు. మిషన్‌కాకతీయ 3వ విడత పనులలో ఎక్కువ పనులు పెండింగ్‌లో ఉన్న మండలాలకు సంబంధించి సమీక్షిస్తూ కలెక్టర్ ఆ పనులకు వెంటనే చేపట్టి పూర్తి చేసేలా చూడాలని ఇ.ఇ. రాములును కలెక్టర్ ఆదేశించారు. మండల వారిగా మిషన్‌కాకతీయ 4వ విడతకు సంబంధించి ఎన్ని ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఎన్నింటికి మంజూరు వచ్చిందని కలెక్టర్ ఆరా తీశారు. వివిధ దశలలో చేపడుతున్న మిషన్‌కాకతీయ పనుల వివరాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎఫ్‌టిఎల్‌కు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదని, ఒక వేళ ఇచ్చినట్లయితే వారిపైన క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కల్హేర్, సిర్గాపూర్, జిన్నారం, కంగ్టి, రాయికోడ్, జహీరాబాద్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, కోహీర్, న్యాల్‌కల్, అందోల్, వట్‌పల్లి, హత్నూర, కంది, కొండాపూర్ , సదాశివపేట, సంగారెడ్డిమండలాల్లో చేపడుతున్న మిషన్‌కాకతీయ పనుల గురించి కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు. రోడ్డు భవనాల శాఖ చేపడుతున్న వివిధ రోడ్ల పనులను మండలం వారిగా కలెక్టర్ సమీక్షించారు. రోడ్లకు సంబంధించి పినిషింగ్, ప్లాస్టరింగ్ ప్రస్తుతం ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఎంతమంది పని చేస్తున్నారని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్రిమెంట్ కన్నా ఎందుకు ఆలస్యం అవుతుందని, ఆలస్యానికి గల కారణాలు ఇంజనీరింగ్ అధికారులు  పరిగణలోకి తీసుకొని పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలలో చేపడుతున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్  సమీక్షించారు. ఆర్‌అండ్ బి శాఖ నిర్మిస్తున్న బ్రిడ్జిలు, అప్రోచ్‌రోడ్లు, కల్వర్టులు, బిటి రోడ్లు,సీసీ రోడ్లపై కలెక్టర్ పూర్తి వివరాలు సేకరించి, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న రెండు పడుకల గదుల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆందోల్, హత్నూర, కంది, కోహీర్, మొగుడంపల్లి, మునిపల్లి, నారాయణ్‌ఖేడ్, న్యాల్‌కల్, పటాన్‌చెరు, పుల్కల్,రాయికోడ్, సదాశివపేట, సంగారెడ్డి, సిర్గాపూర్, వట్‌పల్లి, జహీరాబాద్ మండలాల్లో కొనసాగుతున్న పనులపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షలో ఆర్‌ఆండ్‌బి ఇఇ వెంకటేశ్వర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ఆర్‌అండ్‌బి ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles