Home సినిమా మూడు కథల ఫ్రెష్ స్టోరీ ‘మిస్టర్’

మూడు కథల ఫ్రెష్ స్టోరీ ‘మిస్టర్’

శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్’. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ కథానాయికలు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల14న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్లతో ఇంటర్వూ విశేషాలు…

Srinu-Vaitla

వరుణ్ తేజ్ అయితే బాగుంటుందనిపించింది…
ఇదొక ట్రావెల్ సినిమా. ఎంతో కాలంగా ఒక ట్రావెల్ ఫిలిం చేయాలని అనుకున్నాను. విజువల్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు స్కోప్ ఉన్న సినిమా చేద్దామనుకు న్నాను. ఆ సమయంలో గోపీమో హన్ నాకు ఈ సిని మా లైన్ చెప్పాడు. అలా కథను సిద్ధం చేసు కునేట ప్పుడే వరుణ్‌తేజ్ అయితే బాగుంటుందని అని పించింది. అతనితోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాం.

స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలలో…
‘మిస్టర్’ సినిమా కోసం స్పెయిన్‌లోని 11 నగరాల్లో షూటింగ్ చేశాం. ఆతర్వాత స్విట్జర్లాండ్‌కు వెళ్లాం. ఆతర్వాత ఇండియాకు వచ్చి చిక్‌మంగుళూరులో చిత్రీకరణ చేశాం. అక్కడ చాలా కష్టపడి షూటింగ్ చేశాం. దాని తర్వాత ఊటీ, కేరళ వెళ్లాం. హైదరాబాద్‌లో ఒక్క సీన్ కూడా తీయలేదు.

అద్భుతంగా కనిపిస్తాడు…
వరుణ్‌తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’ చూశా ను. అందులో వరుణ్ బాగా నటించాడు. ఇక ఇప్పటి దాకా వరుణ్ చేసిన సినిమా ల్లో ఎందులోనూ అతను పూర్తిగా ఓపెన్ కాలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం అన్ని యాంగి ల్స్‌లోనూ అద్భుతంగా కనిపిస్తా డు.

సినిమా కొత్తగా ఉంటుంది…
నా గత చిత్రాలకంటే భిన్నంగా ఈ సినిమా కొత్తగా ఉం టుంది. ఇదొ క ఫ్రెష్ లవ్ స్టోరీ. ఇప్పటిదాకా నేను ఇలాంటి సినిమా చేయలే దు. ఈమధ్యన చేసిన సినిమాల్లో నేను సరిగా నవ్వించలేదు. ఈ సిని మాలో మాత్రం కామెడీ ప్రేక్ష కులను కడుపుబ్బ నవ్విస్తుంది.

‘రెడీ’కొచ్చినంతా పేరొస్తుంది…
సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఒక టే కథ ఉం టుంది. కానీ ఇందులో ముగ్గురికీ మూడు కథలుంటాయి. మూడింటినీ కలుపు తూ మంచి కామెడీని సృష్టించడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. ‘రెడీ’ సినిమా కొచ్చి నంత పేరు ఈ సినిమాకొస్తుంది.

చక్కగా నటించారు…
యంగ్ హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ చక్కగా నటించారు. మరీ కొత్తవాళ్లు కాకుండా కొన్ని సినిమాలు చేసి మంచి పాపు లారిటీ తెచ్చు కున్న వీళ్లతో సినిమా చేశాం. హెబ్బా పటేల్ పాత్ర ఆమె ఇదివరకటి సినిమాలకన్నా భిన్నంగా ఉంటుంది. చాలా క్లాస్‌గా కని పిస్తుంది. లావణ్య కూడా చంద్రముఖి పాత్రలో బాగా నటించింది.

అంతా ఈజీ కాదు…
అన్నీ కొత్తగానే ఉండాలి అనుకున్నప్పుడు మ్యూజిక్ కోసం మిక్కీ జె.మేయర్ అయితే బాగుంటుందని తీసుకున్నాం. కానీ మొదట్లో ఎలా చేస్తాడో అనుకున్నా. కానీ అతను మంచి మ్యూజిక్‌ను అందిం చాడు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకు మ్యూజిక్ ఇవ్వడమంటే అంత ఈజీ కాదు.

ఎక్కువగా స్పెషల్ క్యారెక్టర్స్…
ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. ‘రెడీ’ సినిమాలోకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. కామెడీ క్యారెక్టర్స్ కొత్తగా ఉంటూనే హాయిగా నవ్విస్తాయి.

అందుకే స్క్రిప్ట్ ఆలస్యమైంది…
‘మిస్టర్’ను పూర్తిగా కొత్తగా చేయాలని అనుకున్నాను. అందుకే అన్నీ కొత్తగా ఉండేలా చూసుకున్నాను. ఆతర్వాత ప్రేక్షకులు నా నుండి ఆశించేది కామెడీ కనుక దాన్ని కూడా కథ చెడిపోకుండా అందించాను. వీటన్నింటి మూలంగా సినిమా స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఎక్కువ సమయం పట్టింది. ఇకపై కూడా నా నుండి కోరుకునే కామెడీని మాత్రం వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తాను.