Friday, March 29, 2024

టీకా మిక్సింగ్ తో వేరియంట్లకు చెక్

- Advertisement -
- Advertisement -

Mixing two vaccines 'seems to be working well': Soumya Swaminathan

డబ్ల్యుహెచ్‌ఒ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాధన్

జెనీవా : కరోనా కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న తరుణంలో వేర్వేరు టీకాలని (వ్యాక్సిన్ మిక్సింగ్) ఇస్తే ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పత్తి అయి దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తితోపాటు కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ పొందే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ విధానం కొత్త వేరియంట్లపై బాగా పనిచేస్తున్నట్టు తెలుస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాధన్ చెప్పారు. హెటెరోలోగస్ ప్రైమ్ బూస్ట్ కాన్సెప్ట్ వర్కౌట్ అయినట్టు ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఒక డోసు టీకా ఇచ్చి, కొరత వల్ల రెండో డోసు ఇవ్వలేక ఆగిపోయిన దేశాలకు ఇదో అవకాశమనే చెప్పాలని ఆమె పేర్కొన్నారు. అయితే బ్రిటన్, స్పెయిన్, జర్మనీ నుంచి లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం రెండు వేర్వేరు టీకా డోసులు ఇవ్వడం వల్ల జ్వరం, నొప్పి సహా ఇతర దుష్ప్రభావాల తీవ్రత అధికంగా ఉన్నట్టు గమనించామని చెప్పారు. ఇదే సమయంలో యాంటీబాడీలు, కరోనా సోకిన కణాలను చంపే తెల్ల కణాలు అధిక స్థాయిలో ఉత్పత్తి చేయగలిగే బలమైన రోగ నిరోధక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతున్నట్టు తెలుస్తోందన్నారు.

మరోవైపు కొన్ని దేశాలు , ఔషధ సంస్థలు కొవిడ్ బూస్టర్ డోసుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడే బూస్టర్ డోసు గురించి ప్రణాళికలు వేసుకోవడం తొందరపాటే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు బూస్టర్ డోసును సిఫార్సు చేసేందుకు కావాల్సిన సమాచారం ఇప్పటివరకు అందుబాటులో లేదని స్వామినాధన్ స్పష్టం చేశారు. మలేసియాలో ఒకడోసు ఆస్ట్రాజెనెకా, మరోడోసు ఫైజర్ టీకా డోసులను ఇస్తున్నారు. బ్రిటన్‌లో కొవిడ్ బూస్టర్ టీకాలను అందుబాటు లోకి తెస్తున్నారు. శీతాకాలంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి బూస్టర్ టీకాలను ఇవ్వనున్నట్టు మంత్రి మ్యాట్ హాన్‌కాక్ చెప్పారు. ఇంగ్లండ్‌లో ఏడు రకాల బూస్టర్ టీకాలను పరిశీలిస్తున్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌పై ఆశలు రేపుతున్నట్టు అభిప్రాయం కలుగుతున్నా ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు తేలింది. నొప్పి, జ్వరంతోపాటు ఇతర సైడ్ ఎఫెక్ట్ వస్తున్నట్టు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News