Saturday, April 20, 2024

ఎసిబికి చిక్కిన మియాపూర్ ఎస్సై

- Advertisement -
- Advertisement -

Miyapur SI arrested by ACB while taking bribe

స్టేషన్ బెయిల్ కోసం రూ.20వేలు డిమాండ్

మనతెలంగాణ, హైదరాబాద్ : స్టేషన్ బెయిల్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సైని లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా మంగళవారం పట్టుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న వి. యాదగిరి ఓ కేసు విషయంలో వ్యాపారి షేక్ సలీంకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి ఆదేశాల మేరకు కెమికల్ చల్లిన డబ్బులను ఎస్సై యాదగిరికి ఇవ్వగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో ఎస్సై యాదగిరిని అరెస్టు చేశారు. పూమా ఫుట్‌వేర్, షూస్ నకిలీ వస్తువులు విక్రయిస్తున్నారని, ఆ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో షేక్ సలీంకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై యాదగిరి రూ.20,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో ఎసిబి అధికారులకు పట్టించాడు. ఎస్సైని అరెస్టు చేసి ఎసిబి అధికారులు ఎసిబి కోర్టులో హాజరు పర్చాగా జడ్జి రిమాండ్‌కు పంపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News