Home ఆఫ్ బీట్ ఆ దుకాణాలకు యజమానులు ఉండరు

ఆ దుకాణాలకు యజమానులు ఉండరు

Mizoram Shops without Shopkeepers

ఆ దుకాణాలకు యజమానులు ఉండరు. మీరు విన్నది నిజమే. మిజోరంలోని సెలింగ్ పట్టణంలో ఉన్న హైవే మార్గంలో కొండలు , అడవులు, పొలాలు తప్ప ఇళ్లు కనిపించవు. కానీ హైవే పొడవునా కూరగాయలు, పండ్లు, పండ్ల రసాల బాటిళ్లు, ఇతర ఉత్పత్తులు అమ్మే చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి.

Mizoram Shops without Shopkeepers

 

కానీ ఆ దుకాణాల వద్ద యజమానులు ఉండరు. ఆయా ఉత్పత్తుల ధరలు మాత్రం ఓ అట్ట మీద రాసి పెడుతారు. ఆ దారిన పోయే వారు తమకు కావాల్సిన ఉత్పత్తులను తీసుకొని, దాని ధర ప్రకారం దుకాణం వద్ద ఉండే డబ్బాల్లో వేస్తుంటారు.

Mizoram Shops without Shopkeepers

 

 

తమకు చిల్లర రావాల్సి వస్తే డబ్బా నుంచి తీసుకుంటారు. ఆయా కాలాల్లో లభించే ఉత్పత్తులను రైతులు అలా హైవే వెంబడి ఉన్న తమ దుకాణాల్లో పెడుతారు. అనంతరం వారు వ్యవసాయ పనులకు వెళుతారు. తిరిగి సాయంత్రం వచ్చి ఉత్పత్తులు అమ్ముడు పోగా వచ్చిన డబ్బులను తీసుకుని వెళుతారు.

Mizoram Shops without Shopkeepers

 

ఈ ప్రాంతం సెలింగ్ పట్టణానికి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమకు దొరికే కొద్దిపాటి ఉత్పత్తులను తీసుకుని అంతదూరం వారు వెళ్లలేక ఇలా హైవేపై దుకాణాలను పెడుతారు. అయితే యజమానులు లేకున్నా ఉత్పత్తులు కొనుగోలు చేసి, డబ్బును డబ్బాలో వేయకుండా వెళ్ళే వారే ఉండరట. డబ్బు వేయకుండా వెళ్లేవారి సంఖ్య ఒకటో అరో ఉంటుందట. తాము లేకుండా దుకాణాలు నడవడం, ఉత్పత్తులు కొనుగోలు చేసే వారు నిజాయితీగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.