Home జాతీయ వార్తలు పోలీసుల కస్టడీకి బిహార్‌ ఎంఎల్‌ఎ…

పోలీసుల కస్టడీకి బిహార్‌ ఎంఎల్‌ఎ…

 

పాట్నా: అజ్ఞాతంలోకి వెళ్లిన బిహార్‌ స్వతంత్ర ఎంఎల్‌ఎ అనంత్ సింగ్‌ సాకేట్ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హరున్ ప్రతాప్ ముందు లొంగిపోయాడు. దీంతో గురువారం స్థానిక కోర్టులో హాజరుపర్చడంతో రెండు రోజులపాటు ఎంఎల్‌ఎను పోలీసు రిమాండ్‌కు పంపింది. కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ) కింద ఎంఎల్‌ఎపై కేసు నమోదు చేసిన ప్రాసిక్యూషన్, విచారణ కోసం కస్టడీని కోరింది.

కాగా, ఈ నెల 16న ఎంఎల్‌ఎ నివాసం నుంచి ఎకె-47, మందు గుండు సామాగ్రిని పోలీసులు గుర్తించారు. వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లేసరికి అనంత్ సింగ్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. రెండు మూడు రోజుల్లో కోర్టులో లొంగిపోతానని వీడియోను పంపించారు. అనంత్ సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తనకు ఆ ఇళ్లు వారసత్వంగా వచ్చిందని, 14 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి వెళ్లడం లేదని సదరు ఎంఎల్‌ఎ పేర్కొన్నారు. తనకు రాజకీయంగా ఉన్న శత్రువులే తన ఇంటిలో మందు గుండు సామాగ్రి, తుపాకీలు పెట్టి ఉంటారని అనంత్ సింగ్ ఆరోపణలు చేశారు.

MLA Anant Singh sent to police remand by a local court