Home తాజా వార్తలు రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

MLA Madan Reddy

 

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

మన తెలంగాణ/శివ్వంపేట : రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శివ్వంపేటకు సంబంధించిన రైతు పాసుబుక్‌ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరయ్యా రు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరై శివ్వంపేట 1వ సిరియల్‌కు సంబంధించిన 562 రైతుల పట్టాపాస్‌బుక్‌ల పంపిణీ ఎ మ్మెల్యే మదన్‌రెడ్డి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు, రైతుభీమా పథకాన్ని ప్రవేశపెట్టింది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. పాస్‌పుస్తకాలువచ్చిన ప్రతి రైతుకు రై తుబంధు వర్తిస్తుందని ఏ రైతుకూడా ఆందోళన చె ందాల్సిన అవసరం లేదని రైతుబంధు పథకంలో ఆ యన భరోసా ఇచ్చారు. పాస్‌బుక్‌లు వచ్చిన వెంటనే ప్రతి రైతుకు సమాచారం అందించాలని తహశీల్దార్‌కు సూచించారు. మండలంలోని కొంతాన్‌పల్లి, ద ంతాన్‌పల్లి, నవాపేట, శివ్వంపేటలో ఎండోమెంట్ భూములు, అటవీశాఖ భూములని అటవీ అధికారు లు అంటున్నారని రైతులు ఎన్నో సంవత్సరాలనుంచి సాగు చేసుకుంటున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలు పరిష్కరించుకొనుటకు వారి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించి వారికి పట్టాపాసు బుక్‌లు వచ్చేలా కృషి చేస్తానన్నారు.

శివ్వంపేటలోని 315, 316 సర్వేనంబర్‌లోని జమీందారు భూములు కావడంతో ఉన్న భూ మికంటే ఎక్కువ పట్టాలు రావడం వలన సరైన లబ్ధిదారులను గుర్తించి వారికి పట్టాబుక్‌లు వచ్చేలా కృ షి చేస్తానని అన్నారు. అటవీభూములను పరిరక్షించాలని రైతులకు సూచించారు. అనంతరం శివ్వంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంత్‌సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనం గా జయంతి ఉత్సవాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని గిరిజన మహిళా సర్పంచ్ సుమలతరాజ్‌కుమార్‌లు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీ కల్లూరి హరిక్రిష్ణ, జడ్పీటీసీ కమలపూల్‌సింగ్, రైతు సమన్వయ సమితి మండల అద్యక్షులు పిల్లుట్ల నర్సింహరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీలు మన్సూర్, విజయవెంకటేశ్, తహశీల్దార్ భా నుప్రకాశ్, నాయకులు పబ్బ రమేష్‌గుప్తా, గొర్రె వెంకట్‌రెడ్డి, దావుద్, సర్పంచ్‌లు సుమలతరాజ్‌కుమా ర్, శశాంక్‌శర్మ, శివులు, శివ్వంపేట ఉప సర్పంచ్ ప ద్మవెంకటేశ్, లక్ష్మీనర్సయ్య, పోచాగౌడ్, కొండల్, గౌరిశంకర్, అశోక్, ఖాదీర్ పాల్గొన్నారు.

MLA Attend to Farmer Pass Book Distribution Program