Tuesday, November 28, 2023

తెలంగాణలో మరో ఎంఎల్ఎకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

MLA Bajireddy Govardhan infected with Corona

 

నిజామాబాద్ : కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్ తండాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు పట్టాలను నిన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కూడా పాల్గొన్నారు. అలాగే, బిజెపి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన మెంట్రాజ్పల్లి మాజీ సర్పంచ్ అంబర్ సింగ్ రాథోడ్, మరికొందరు కార్యకర్తలను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం జనగామ ఎంఎల్ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News