Friday, April 26, 2024

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారు?:బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

MLA Balka Suman fires on BJP 

హైదరాబాద్: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారని ప్రభుత్వ విప్, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ బాల్కసుమన్ విమర్శించారు. దేశంలో 8 లక్షల 72 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆరోపించారు. నిరుద్యోగం విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. జాతీయంతో పోలిస్తే తెలంగాణ నిరుద్యోగ రేటు చాలా తక్కువ అని అన్నారు. ఈ విషయం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. బండి సంజయ్‌కు ఇది గుర్తు లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిందన్నారు. ఇలా చేయడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు అయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ వచ్చే ఐటిఐఆర్ ఎందుకు రద్దయిందని ప్రధాని మోడీని బండి సంజయ్ అడగాలని అన్నారు. సింగరేణిని అమ్మేయాలని కేంద్రం చూస్తోందని అన్నారు. బండి సంజయ్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరన్నారు. కేవలం మీడియాలో కనిపించేందుకే కాంగ్రెస్ నాయకులు ఆరాటపడుతున్నారని ఆరోపించారు. బిజెపి మీద పోరాటం చేయడానికి ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని బాల్క సుమన్ అన్నారు.

MLA Balka Suman fires on BJP 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News