Friday, March 29, 2024

బండి సంజయ్ మాటతీరు మార్చుకో: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

MLA Balka Suman Fires on MP Bandi Sanjay

హైదరాబాద్: ఎంపి బండి సంజయ్ తన విధానం మార్చుకోవాలని బాల్కసుమన్ హెచ్చరించారు. బండి సంజయ్ మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని బాల్కసుమన్ మండిపడ్డారు. బండి సంజయ్ జర్నలిస్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బండి సంజయ్ మాటతీరు, పద్దతి మార్చుకోవాలని సూచించారు. బట్టకాల్చి మీద పారేయాలని చూస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరని బాల్క పేర్కొన్నారు. బండి సంజయ్ ది నోరా.. మోరా.. తాటి మట్టనా అని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా వచ్చినప్పటికి సిఎం కెసిఆర్ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. కరోనా విషయంలో బిజెపి ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో అందరూ చూస్తున్నారని చెప్పారు. సిఎం కెసిఆర్ పై బండి సంజయ్ దుర్మార్గంగా మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తునే ఉన్నారని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలైనా బండి సంజయ్ కి బుద్ది రాలేదన్నారు.

MLA Balka Suman Fires on MP Bandi Sanjay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News