Home తాజా వార్తలు పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎంఎల్ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డి

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎంఎల్ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డి

MLA beeram harshvardhan planted plants on his birthday

 

హైదరాబాద్: కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని హైదరాబాద్ బంజారా హిల్స్ ఎంఎల్ఎ కాలనీలో తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… సిఎం కెసిఆర్ హరితహారం స్పూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన ఎంపి సంతోష్ కుమార్ కి భీరం హర్షవర్ధన్ రెడ్డి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం ప్రారంభించాలన్న, పుట్టినరోజు, పెళ్లి రోజు ఇతర శుభకార్యాలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం సంప్రదాయంగా మారిందని కొనియడ్డారు. హరిత హారం, గ్రీన్ ఇండియ ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అటవీ శాతం పెరిగిందని, గ్రినరీ పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

MLA beeram harshvardhan planted plants on his birthday