Home తాజా వార్తలు పేదలను ఆదుకునే సిఎంఆర్ఎఫ్ : భూపాల్ రెడ్డి

పేదలను ఆదుకునే సిఎంఆర్ఎఫ్ : భూపాల్ రెడ్డి

MLA Bhupal Reddy Distributing CMRF Chequesనల్లగొండ : నిరుపేదలకు సిఎంఆర్ఎఫ్ వరమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 100 మందికి శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడేళ్ల కాలంలో నియోజకవర్గ పరిధిలో రూ. 15 కోట్లను సిఎంఆర్ఎఫ్ నుంచి అందించామని ఆయన చెప్పారు. అనారోగ్యంతో బాదపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.