Friday, March 29, 2024

బండి… తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలి: గాదరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 26 మంది కేంద్రమంత్రులపై కేసులు ఉన్నాయని తుంగతుర్తి  ఎంఎల్‌ఎ గాదరి కిషోర్ తెలిపారు. సోమవారం కిషోర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై గుజరాత్‌లో గతంలో కేసులున్నాయని, హైకోర్టు తీర్పు ప్రకారం అప్పటి గుజరాత్ ప్రభుత్వం అమిత్ షాను రెండు సంవత్సరాలు రాష్ట్రానికి రాకుండా నిషేధం విధించిందిన గుర్తు చేశారు.  గతంలో అమిత్ షా కుటుంబ సమేతంగా ఢిల్లీలో దొంగలా దాచుకున్నాడని విరుచుకపడ్డారు. ప్రజల భావోద్వేగంతో భారతీయ జనతా పార్టీ ఆడుకుంటోందని మండిపడ్డారు. 2014 ఎన్నికల ముందు స్విస్ బ్యాంకులో నల్లధనం తీసుకొచ్చి ప్రతీ ఒక్కరి ఎకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని ఇచ్చిన వాగ్దానం ఏమైందని గాదరి ప్రశ్నించారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వారిని బిజెపి నేతలు దేశం దాటిస్తు లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ పని తీరును చాలా మంది కేంద్ర మంత్రులు ప్రశంసించారన్నారు. బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌కు దమ్ముంటే తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏం చేసిందో? చెప్పాలని సవాలు విసిరారు. రెండు రోజులైతే బండివి బట్టలూడదీసి కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. అమలవుతున్న మోడీ ప్రభుత్వాల పథకాల పేర్లు చెప్పాలని బండిని నిలదీశారు. ఇప్పటికైనా బండి.. బట్టేబాజ్ మాటలు మాట్లాడొద్దని కిశోర్ తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News