Home తాజా వార్తలు కరోనా కట్టడికి పక్కా చర్యలు : ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్

కరోనా కట్టడికి పక్కా చర్యలు : ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్

MLA Gadri Kishore Kumar Comments On Coronaసూర్యాపేట : కరోనా కట్టడికి ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటున్నట్టు తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన కరోనా ఐషోలేషన్ సెంటర్‌ను కిశోర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా బాధితులు ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆయన మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ  కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ గుజ్జ దీపిక, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.