Home కామారెడ్డి దేశానికి తెలంగాణ రైతులు ఆదర్శం కావాలి

దేశానికి తెలంగాణ రైతులు ఆదర్శం కావాలి

Telangana farmers need the country's mission

మనతెలంగాణ/దోమకొండ: భారత దేశంలోనే తె రైతులు ఆదర్శం కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. సోమవారం దోమకొండ మండల కేంద్రంలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబం ధు పథకం కింద దోమకొండకు రూ. 1 కోటి 50లక్షల పంట పెట్టుబడి సాయం కింద అం దజేస్తున్నామని, రైతులకు అప్పులు కావద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు పంట పె ట్టుబడి సాయం అందజేయడం జరుగుతుందన్నా రు. కామారెడ్డి నియోజకవర్గంలో రూ. 44 కోట్లు , యాసంగి పంటకు మరో44కోట్లు రూపాయలు అం దజేస్తామన్నారు. నియోజకవర్గంలో 58 వేల మంది కి పెన్షన్‌లు అందజేస్తున్నామన్నారు. ఆడపిల్లకు ఇ బ్బంది పెట్టోద్దన్న ఉద్దేశ్యంతో కల్యాణలక్ష్మి కింద రూ. 51 వేలు, తర్వాత రూ. 75 వేల1 వంద 116 చొప్పున ఏప్రిల్ నుండి రూ. 1లక్ష 1 వేయి 116 ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భం గా గుర్తు చేశారు. అలాగే నియోజకవర్గానికి రెం డు 102 నంబర్ వాహనాలను ఏర్పాటు చే యడం జరిగిందన్నారు. జడ్‌పిటిసి గండ్ర మధుసూధన్‌రావు, మార్కెట్ కమిటీ వై స్ చైర్మన్ కుంచాల శేఖర్, మండల రైతు కమిటీ అ ధ్యక్షులు రావులపల్లి నర్సారెడ్డి, ఎంపిపి గంగు బాల్‌రాజవ్వ, సర్పంచ్ దికొండ శారదారాజశేఖర్, ఎం పిటిసిలు పోచయ్య, నాగరాజ్‌రెడ్డి, ముదాం గం గయ్య, సంజీవరెడ్డి, తహసీల్దార్ సాయి భు జంగరావు, ఎంపిడిఒ శ్రీనివాస్‌గౌడ్, డిటి తి ర్మల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్‌లో…
దేశంలోనే నంబర్‌వన్ సిఎం కెసిఆర్ అని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కొనియాడారు. సోమవారం మండలంలోని నాగల్గాం గ్రామంలో జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడగకుండా అన్నం పెట్టే పెద్ద రైతుగా నిలిచారన్నారు. రైతుల పాలిట అడగని వరమయ్యరన్నారు. రైతులకు పెట్టుబడి కింద డబ్బులు ఇవ్వడం తాను చూసిన మొదటి సిఎం కేసిఆరేనన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా రైతులు తీసుకుంటున్న చెక్కుల డబ్బులు వృథా చేసుకోవద్దని అన్నారు. పంటల సీజన్ ఇంకా నెల రోజులు ఉన్నందున డబ్బులు అనవసర ఖర్చులకు ఉపయోగించరాదని సూచించారు. బ్యాంకులో ఇబ్బందులు ఎదురైతే అధికారులకు తెలిపాలని అన్నారు. పార్ట్ బిలో ఉన్న రైతులకు వచ్చే నెలలో చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. బస్వాపూర్, కకేంరాజ్‌కొల్లాలి, చిన్న గుల్లాగ్రామాల్లో స్థానిక నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాదవరావు, సాయాగౌడ్, గంగాధర్, బస్వంత్రావ్, రాజుపటేల్, వెంకటి, మారుతి పటేల్, అనిల్ అశోక్, తహసీల్దార్ శంకర్‌సింగ్, ఆర్‌ఐ తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లిలో…
రైతులకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలతో ఇదీ నిజంగా రైతు రాజ్యమేనని గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో సోమవారం గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి రైతుబంధు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 1100మంది రైతులకు సుమారు 1.50 లక్షల రూపాయలు అందిస్తుందని అన్నారు. రైతు సంక్షేమంకోసం పాటుపడే కెసిఆర్ పాలనపై ప్రజలు సంతోషంతో ఉన్నారన్నారు. ఆయనకు ఓట్లేసీ మళ్లీ రుణం తీర్చుకుంటామని అంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు యంత్రలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ, రుణమాఫీ వంటి పథకాలతో ప్రజలు కెసిఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మానణానికి 2300 కోట్లు డబ్బులు అందించడంతో పైపులైను ద్వారా సాగు నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. రెండేళ్ల కాలంలో గ్రామీణ నియోజకవర్గంలో మంచిప్ప సాగునీరు పథకాన్ని అమలుచేస్తే ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్‌వాయి. సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాలలకు చెందిన రైతులకు సాగునీరుకు ఢోకా ఉండదని అన్నారు. కెసిఆర్ సాగునీరుకోసం వినతిచేస్తే రైతులకోసం 1200 కోట్ల పథకాన్ని అమలు చేసేందుకు నిధులు కొరత ఉంటుందని ఇందుకు అదనంగా వేయి కోట్లు నిధులు అందించిన ఘనత కెసిఆర్‌దేనని అన్నారు. రైతులను గత పాలకులు నిర్లక్షం చేశారని వారికి తగిన సహాయం చేస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రైతులకు పాసుపుస్తకాలు, చెక్కులు అందించడంతో రైతులు మురిసిపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచి సర్మన్ నాయక్, జడ్పీ ఉపాధ్యక్షురాలు గడ్డం సుమనరవిరెడ్డి, మండలాధ్యక్షుడు ఇమ్మడిగోపి, రైతుసమన్వయసమితి అధ్యక్షుడు పీసురాజ్‌పాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నల్లహన్మంత్‌రెడ్డి, విండో అధ్యక్షుడు కిశోర్‌రెడ్డి, శంకర్‌నాయక్, ఎంపిటీసీ సభ్యులు సరోజనలింగం, కోతినర్సయ్య, గ్రామకమి టీ అధ్యక్షుడు కోతిశేఖర్‌రెడ్డి, బద్దంచిన్నగంగారెడ్డి, విష్ణురెడ్డి, సీఐ రామాంజనేయులు, తహసీల్దారు రమేశ్, ఎంపిడిఓ గణపతినాయక్, ఎస్‌ఐ పూర్ణేశ్వర్, వ్యవసాయాధికారి ప్రవీన్‌కుమార్, ఎమ్మారై శ్రీనివాస్, వీఆర్వోలు గంగాధర్, పోశెట్టి, సదానందం తదితరులు పాల్గొన్నారు.
భీంగల్‌లో…
భీంగల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో రైతుబంధు పథకం ద్వారా చెక్కులు, పట్టాపాస్ పుస్తకాలను మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. ఉద్యమ సమయం నుండి మొదలుకోని నేటి వరకు రైతులకు ఏదో చేయాలనే తపనతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమ సమయాన తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారని అన్నారు. గతంలో భూ వివాదాల పరిష్కారానికి రైతులు ఎంతగా బాధపడేవారో అందరికి తెలుసన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో ఎన్నో యేండ్లుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యల పరిష్కారం చూపించామన్నారు. రైతుల పట్టాపాస్ పుస్తకాలను తాకట్టు పెట్టుకోనే అవసరం లేకుండా రుణాలు పొందేలా చేయడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించకపోవడంతోనే కెసిఆర్ నేడు రైతులకు ఏదో చేయాలనే తపనతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపేట్టడం జరిగిందని వివరించారు. ఈ పథకం ద్వారా రైతులకు రెండు పంటలకు ఎకరానికి రూ. 8 వేల చొప్పున పంట పెట్టుబడిని అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా జాగిర్యాల్ గ్రామానికి చెందిన 500 మంది రైతులకు రూ. 51 లక్షల 13వేల 810 లను పంట పెట్టుబడి క్రింద అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో ఏ దేశంలో కాని, రాష్ట్రంలో కాని ఇలాంటి ఆలోచన ఎవ్వరూ చేయలేదని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి పేదవానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలనే లక్షంతో ముందుకు వెళ్తున్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా, పథకాలను రూపొందించడం జరగుతుందన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న పథకాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రజలు ఆదరిస్తున్న పథకాలపై విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాగిర్యాల్ గ్రామాభివృద్ధ్ది కమిటీ భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆదర్శ యూత్ సభ్యుల వినతి మేరకు టిపిపి నిధుల నుండి లక్ష రూపాయలు గ్రంథాలయ ఏర్పాటుకు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో బీంగల్ సహకార సంఘం అధ్యక్షుడు చౌట్‌పల్లి రవి, పార్టీ మండల అధ్యక్షుడు గుణ్వీర్ రెడ్డి, సహాకార సంఘం ఉపాధ్యక్షుడు ఓమాయి రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట్‌లో…
సబ్బండ వర్గాల మేలు కొరకే రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో సర్పంచ్ పుష్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులు, పథకాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, జడ్పిటిసి నందరమేష్, ఎంపిపి సుదర్శన్, సిద్దిరాములు, రైతు సమన్వయ మండలాధ్యక్షులు మోహన్‌రెడ్డి, బలవంత్‌రావు, ఎంపిటిసిలు, రవి, రాణిసుదర్శన్, నాగరాజు,రమేష్, విఆర్‌లో పాల్గొన్నారు.
నందిపేటలో…
తెలంగాణా సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం రైతుల సంక్షేమం కొరకేనని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కంఠం, చింరాజ్‌పల్లి, కుద్వాన్‌పూర్, అన్నారం గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, సాగునీటి రంగాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇప్పుడు పెట్టుబడి చింత లేకుండా రైతుబంధు చెక్కులను అందజేసి రైతులకు మరింత చేరువయ్యిందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్మూర్ నియోజకవర్గంలో 35 కోట్ల పెట్టుబడి సహాయం అందుతుందని ఆయన అన్నారు. రైతులు తీసుకున్న చెక్కులను ఆయా బ్యాంకుల్లో మార్చుకుని నగదు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యమున, జడ్పీటీసి స్వాతి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ మీసాల సుదర్శన్, సర్పంచులు ధర్మన్న, నర్సాగౌడ్, ముత్యాల సునిత, రాజేండ్ల దివ్యరాజు, తహసీల్దార్ ఉమాఖాంత్, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ: అన్నం పెట్టే రైతన్నలు సుఖసంతోషాలతో జీవిస్తూ ఆత్య విశ్వాసంతో వ్యవసాయం చేయాలనే ఉద్దేశ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుబంధు పథకం అమలు చేస్తున్నాడని, రైతులు ఈ సద్వినియోగం చేసుకోవాలని, నమ్ముకొని బతకాలని అమ్ముకోవద్దని నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. న్యావనంది గ్రామంలో రైతుబంధు చెక్కులు, పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్షం చేయడంతో రాష్ట్రంలోని రైతులు వ్యవసాయంపై నమ్మకం కోల్పోయి, భూములను అమ్ముకొని పట్టణాలకు వలసలు పోయారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవసాయాన్ని పండగ చేయాలని, రైతన్నలకు భరోసా కల్గించడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు అమలు చేయాలనే ఆలోచనలో వున్నాడన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం చేరువయిందని కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ అభివృద్ధ్దికి తన వంతు కృషి చేస్తున్నానని గత10 సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే చేయని పనులు నేను చేసి చూపించానని గోవర్థన్ అన్నారు. రానున్న రోజుల్లో మరి అభివృద్ధి పనులు చేసి చూయిస్తానని అన్నా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లాలిబాయి, ఎంపిటిసి గోరిబాయి, ఎంపిపి బోయిడి మంజుల ప్రకాశ్, గడీల శ్రీరాములు, తోటరాజన్న,రామస్వామిగౌడ్, మోతె చిన్నారెడ్డి, కన్కశ్రీనివాస్, ఉప సర్పంచ్ సుంకెట రమేశ్‌రెడ్డి, మండల తహసీల్దార్ ఎల్.వీర్‌సింగ్, ఎంపిడిఒ చెంధర్‌నాయక్, దేవిసింగ్‌తదితరులు పాల్గొన్నారు.
ఏర్గటలో…
ప్రతి రైతు ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని బతకాలని ఆలోచించే ముఖ్యమంత్రి కె సి ఆర్ పంట పెట్టుబడి క్రింద వేలాది కోట్ల రుపాయలను రైతులకు అందించడం జరుగుతోందని అన్నారు. ప్రతి సారి పంట వేసే ముందు అప్పుల కోసం రైతు తిరగావద్దనే ఉద్దేశ్యంతో రైతుబంధు పథకం క్రింద చెక్కులను అందజేయడం జరుగుతోందిని తెలిపారు. రైతుల ఆదుకోవడమే ప్రభుత్వ లక్షంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని బట్టాపూర్ గ్రామంలో సోమవారం రైతుబంధు పథకం క్రింద రైతులకు చెక్కులను, పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. బట్టాపూర్ గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంతో పండుగ వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసిన ప్రభుత్వం పెట్టుబడి క్రింద అందిస్తున్న చెక్కుల సహాయం పైనే చర్చలు జరుపుకోవాటలు కనబడ్డాయి. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ…. ఒక బట్టాపూర్ గ్రామంలోనే 654 మంది రైతులకు గాను 49 లక్షల 3 వేల 160 రుపాయల చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. రెం విడత యాసంగిలో కూడా పెట్టుబడి కోసం చెక్కులను అందజేయడం జరుగుతోందని తెలిపారు. మొత్తాని బట్టాపూర్ గ్రామానికి ఒక కోటి రూపాయలు రెండు విడతాలుగా అందనున్నట్లు తెలిపారు. స్వయనా కేసిఆర్ రైతు కాబట్టి రైతుల సాధక బాధలు తె కాబట్టి పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారని అన్నారు. ఏనాడు రైతుల గురించి పట్టించుకోని ప్రభుత్వాలు ఈనాడు రైతులను పెట్టుబడి సహాయం అందిస్తుంటే ఓర్వలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతి సారి పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు తీసుకొనే వారిని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రైతాంగానికి రాదనే బరోసా రైతుల్లో ఏర్పాడిందని చెప్పారు. చెప్పిప మాటకు కట్టుబడి ఉండే ముఖ్యమంత్రి కెసిఆర్ అంటేనే ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పి డి సత్యనారయణ, తహసీల్దార్ ముంతజిబోద్దిన్, జడ్. పి.టి.సి అమృత పూర్ణనందం, మండల నాయకులు రైతులు పాల్గొన్నారు.