Home కామారెడ్డి ప్రజల రుణం తీర్చుకుంటా : హన్మంత్ షిండే

ప్రజల రుణం తీర్చుకుంటా : హన్మంత్ షిండే

MLA Hanmanth Shindeపిట్లం (కామారెడ్డి) : జుక్కల్ ఎమ్మెల్యేగా మూడోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు రుణపడి ఉండి సేవ చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిట్లం మండల కేంద్రం, మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రతి పూరి గుడిసెను పక్కా ఇండ్లుగా మారుస్తామని, సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్న వారికి రూ. 5 లక్షల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకున్న మహిళలకు కెసిఆర్ కిట్‌ను అందజేస్తూ , ఆడ బిడ్డ పుడితే రూ. 13 వేలు, మగ బిడ్డ పుడితే రూ. 12 వేలు అందజేయడంతో పాటు రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీళ్లు, రైతులకు రైతుబంధు, రైతు బీమా అందజేస్తున్నారన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో తమ ప్రభుత్వమే ఉంటుందని, కార్యకర్తలకు అందుబాటులో ఉండి అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ నెల 14న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులనే భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నీటి సమస్య  తీరుస్తామని చెప్పారు. పిట్లం మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలంటే టిఆర్ఎస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డితో పాటు జడ్పీటీసీ అభ్యర్థి అన్నారం వెంకట్ రాంరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి రమేష్, రేఖా నవీన్, నందు నాయక్, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MLA Hanmanth Shinde Election Campaign In Pitlam