Saturday, April 20, 2024

మా సినిమా చాలా పెద్దగుంటది… వాళ్లంతా పారిపోవాల్సిందే…!

- Advertisement -
- Advertisement -
MLA Jeevan Reddy comments on bjp leaders
సిఎం కెసిఆర్ రెండు సార్లు ఢిల్లీ పోతనే రాష్ట్రమంతా షేక్ అవుతోంది
మాకు రావల్సిన నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ పోతం
రాష్ట్ర బిజెపి, కాంగ్రెస్ నాయకులపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: మా సినిమా చాలా పెద్దగుంటది… వాళ్లంతా పారిపోవాల్సిందేనని, రాష్ట్ర బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఏదీ పడితే అది మాట్లాడుతున్నారని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బిజెపి పార్టీ భారతీయ జనకంటక పార్టీగా మారిందని ఆయన ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అబద్దాలు తప్ప ఏదీ మాట్లాడరని ఆయన ఆరోపించారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టిమ్స్ ఆసుపత్రిని గచ్చిబౌలి క్రీడా స్థలంలో నెలకొల్పారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనాకు ప్రత్యేక ఆసుపత్రి అవసరం లేదని రఘునందన్ అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, వైద్యానికి సమానమైన ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని గణాంకాలు తెలంగాణ ప్రగతిని సూచిస్తున్నాయని, కానీ బిజెపి నాయకులకు అది మాత్రం కనిపించడంలేదని ఆయన ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తుందని, టిఆర్‌ఎస్ ఎవరి ఒత్తిడికి తలవంచదని ఆయన తెలిపారు.

హుజూరాబాద్ అంతా సారు.. కారు.. పదహారు

మొత్తం హుజూరాబాద్ అంతా సారు.. కారు.. పదహారు అంటున్నారని అక్కడ తామంతా పెద్దఎత్తున విజయం సాధించబోతున్నామని ఆయన జోస్యం చెప్పారు. ధర్మమే గెలుస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రవేశపెట్టిన 120 పథకాలను ప్రజలు చూస్తున్నారన్నారు. నాగార్జునసాగర్‌లో ఎలాగైతే విజయం సాధించామో, ఇక్కడ కూడా అలాగే తమ విజయం ఉండబోతోందన్నారు. ఇప్పటికైనా ఈ భారతీయ జనకంటక పార్టీ, బడా జోకర్స్ పార్టీ, బడా జుఠా పార్టీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు మాట్లాడాల్సింది మా మీదకాదు, కేంద్రంలో ఉన్న మోడీ మీద మాట్లాడాలని ఆయన సూచించారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి? మాకు రావల్సిన నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ పోతం…. రెండు సార్లు ఢిల్లీ పోతనే రాష్ట్రమంతా షేక్ అవుతోంది. బిజెపి, కాంగ్రెస్ నాయకులంతా ఆగమైతుండ్రు…. మా సినిమా చాలా పెద్దగుంటది. రానున్న రోజుల్లో వాళ్లంతా రాష్ట్రాన్ని వదిలి పారిపోతరంటూ.. జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News