Home ఆదిలాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి : జోగు రామన్న

టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి : జోగు రామన్న

MLA Jogu Ramannaఆదిలాబాద్‌ : ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి జడ్పిటిసి అభ్యర్థి ఆరె రాజన్న, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని లాండసాంగ్వి గ్రామానికి చెరుకున్న ఎమ్మెల్యేతో పాటు పార్టీ అభ్యర్థులకు గ్రామస్థులు, టిఆర్‌ఎస్ నాయకులు డప్పువాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటింటికి తిరుగూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని అన్నారు. 72 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఏ పార్టీ కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలతో పాటు పలు పథకాలను ప్రవేశపెట్టి ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డామని గుర్తు చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరవులు అందించడంతో పాటు రైతుబంధు, రైతు భీమా పథకాలతో రైతుల కుటుంబాలకు మేలు చేకూరుతుందని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

MLA Jogu Ramanna Election Campaign in Adilabad