Home కరీంనగర్ శ్రీవారిని దర్శించుకున్న ఎంఎల్‌ఎ కల్వకుంట్ల

శ్రీవారిని దర్శించుకున్న ఎంఎల్‌ఎ కల్వకుంట్ల

MLA

తిరుమల : తిరుమల శ్రీవారిని కోరట్ల ఎంఎల్‌ఎ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఎంఎల్‌ఎ స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేశారు. మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం, స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని బస్సు యాత్రలు చేసినా , తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులే  తిరిగి టిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

MLA Kalvakuntla visited Tirumala Srivaru