Home ఆంధ్రప్రదేశ్ వార్తలు సిఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ఎంఎల్ఎలు, మంత్రులు..

సిఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ఎంఎల్ఎలు, మంత్రులు..

 

అమరావతి: వైసిపి మహిళా ఎంఎల్ఎలు, మంత్రులు మరోసారి రాఖీ పండుగ జరుపుకున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి  వైస్ జగన్‌కు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. అనంతరం సిఎం జగన్‌తో సెల్ఫీ కూడా తీసుకున్నారు. అయితే, ఇప్పుడు రాఖీ పండుగ కాదు కదా.. మరి రాఖీలు కట్టడమేంటని అనుకుంటున్నారా? దానికి ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఎపి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం. తెలంగాణలోని షాద్ నగర్ దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా తీసుకొచ్చిన కొత్త బిల్లుకు ఎపి కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమిలన్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఈ చట్టానికి దిశా అని పేరు పెట్టారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. దీంతో మహిళల భద్రత కోసం దిశా చట్టం తీసుకొచ్చినందుకు వైసిపి మహిళా ఎంఎల్ఎలు, మంత్రులు సిఎం జగన్ ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీలోనే నగరి ఎంఎల్ఎ రోజా, డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనితతోపాటు పలువురు మహిళా ఎంఎల్ఎలు జగన్ కు రాఖీలు కట్టారు.

MLA Roja Ties Rakhi to AP CM Jagan for Disha Act