Thursday, April 25, 2024

కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలం: సైదిరెడ్డి

- Advertisement -
- Advertisement -

huzurnagar mla saidi reddy

హైదరాబాద్: కరోనా సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం కోసం లక్షలాది మంది ఎదురుచూశారని హుజూర్‌నగర్ ఎంఎల్‌ఎ శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బ్రతుకుతామని ప్రజల నమ్మకం కలిగిందన్నారు. పంజాబ్, హర్యానాలో ముఖ్యమంత్రులు కనీసం పర్యటించిన దాఖలాలు కనిపించలేదన్నారు. తెలంగాణలో ఎలాంటి సంక్షోభంలోనైనా ప్రజలకు భరోసాగా నిలిచింది సిఎం కెసిఆర్ మాత్రమే అని ప్రశంసించారు. మిషన్ భగీరథ లాంటి పథకాన్ని అన్ని రాష్ట్రాలు చేపట్టాలని నీతి ఆయోగ్ సూచించిందని, భగీరథ పథకానికి 25 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచిస్తే.. మోడీ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దేశంలో గుజరాత్ తరువాత కేంద్రానికి అత్యధికంగా జిఎస్‌టి చెల్లిస్తుంది తెలంగాణ అని సైదిరెడ్డి తెలియజేశారు. తెలంగాణకు రావాల్సిన డబ్బులు రాష్ట్రానికి విడుదల చేయాలని కోరినా కూడా మోడీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. కరోనా సమయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, చప్పట్లు, దీపాలు వెలిగించడం తప్పా మోడీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఎంపిలు కేంద్రం నుంచి ఒక్క రూపాయైనా తీసుకొచ్చారా? అని నిలదీశారు. ప్రపంచం వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతుంటే మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News