Home తాజా వార్తలు ప్రత్యామ్నాయ పంటల వైపే మొగ్గు చూపాలి

ప్రత్యామ్నాయ పంటల వైపే మొగ్గు చూపాలి

MLA Sheri subhash reddy inspected his farm

 

మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా వరికి బధులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సిఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎంఎల్ఎ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు తన వ్యవసాయ క్షేత్రంలో వరికి బదులుగా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, గుమ్మడి, జనుము, పత్తి పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. తన 54 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రైతులతో కలిసి కలియ తిరిగి వ్యవసాయ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని అన్నారు. రైతుల సంక్షేమం కోరకు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, సబ్సీడి వ్యవసాయ యంత్రాలు అందజేస్తున్నారన్నారు. ఈ విధంగా నిరంతరం రైతు శ్రేయస్సును కోరే సిఎం కెసిఆర్ పట్ల ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

ప్రతిపక్షాల విమర్శ సద్విమర్శాలుగా ఉండాలి. అది పాలకులకు ఆమోదయోగ్యంగా ఉంటే దానిని ప్రభుత్వం అమలు పరిస్తే రైతులకు మేలు చేకూరే విధంగా విమర్శలు ఉండాలి కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరైతు ప్రత్యామ్నాయ పంట వైపు మొగ్గు చూపాలని సిఎం పదేపదే చెబుతున్నప్పటికీ వారిని తప్పుదోవ పట్టించి నష్టపోయే విధంగా వరి నాట్లు వేయాలని ప్రలోభాలకు గురిచేయడం వల్ల అన్నదాతలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 70 శాతం పండించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు చేర్చామని 391 కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 130 కేంద్రాల్లో కొనుగోలు పూర్తయిందన్నారు.

మిగతా వాటిలో కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యాసంగిలో వరిధాన్యం వేస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవని రైతులకు సూచిస్తూ సన్నరకం పంట వేసుకుంటే మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని తెలియజేశారు. ఏది ఏమైనా యాసంగిలో పంట మార్పిడి విధానం వైపు రైతు మొగ్గు చూపాలని తెలిపారు. రైతుల కోసం దేశంలో ఎక్కడలేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన సిఎం కెసిఆర్ సూచించిన విధంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దని సూచించారు. రాజకీయ అవసరాల కోసమే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని, రైతులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయరాదని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు యామిరెడ్డి, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ శేరి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MLA Sheri subhash reddy inspected his farm