Friday, April 19, 2024

‘గులాబీ’ వైపే పట్టభద్రులు!

- Advertisement -
- Advertisement -

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు మొదటి నుంచి టిఆర్‌ఎస్ కైవసం
ఇప్పటికి మూడు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మద్దతు దారులే విజయం
నాల్గవ సారి గెలిచేందుకు గులాబీ వ్యూహం
ఈసారి తొలి ప్రాధాన్యత ఓట్లపై గురి పెట్టిన ‘పల్లా’
రెండో ప్రాధాన్యత ఓట్లను నమ్ముకుంటున్న తెలంగాణవాదులు

MLC Elections in Telangana

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి:  దక్షిణ తెలంగాణలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం మొదటి నుంచి టిఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా విరజిల్లుతూ వస్తుంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థ్దానానికి మార్చి14న ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ స్థ్దానానికి మొత్తం 71మంది పోటీలో ఉండగా అందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థ్ధులు దాదాపు పది మంది వరకు ఉన్నారు.వీరంతా తెలంగాణ అంశమే ఏజెండాగా ప్రచార అస్త్రాలను ఎంచుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. పోటీలోఉన్న ముఖ్యుల్లో చాలా మంది తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన వారు ఉన్నారు. ఫ్రొపెసర్లు, డాక్టర్లు, లెక్చరర్లు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, మాజీ ఎమ్మెల్సీలు బరిలో తమ అదృష్టాన్ని పరిక్షించుకోబుతున్నారు. మొత్తం 5లక్షల55వేల565 మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు ను వినియోగించుకోబోతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి పునరుద్ధ్దరణ జరిగిన తరువాత ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ మూడు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. నాల్గవ సారి కూడా తామే విజయం సాధిస్తామని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు. 2007లో జరిగిన ఎన్నికల్లో కపిలవాయి దిలిప్‌కుమార్ గెలుపొందారు. అప్పట్లో ఆయన పదవి కాలాన్ని డ్రా పద్ధ్దతిన నిర్ణయించారు. అయితే ఆయన రెండేళ్ళ పదవీ కాలం కూడా పూర్తికాకముందే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2008లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత దాదాపు 13 నెలల పాటు ఈ స్థ్దానం ఖాళీగానే ఉంది. 2009లో జరిగిన ఎన్నికల్లో కపిలావాయి దిలిప్‌కుమార్ రెండోసారి పోటీ చేసి గెలుపొందారు. ఇక మూడో సారి 2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పైవేట్ విద్యా సంస్థల అధినేతగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అప్పట్లో రెండో స్థానంలో బిజెపి నిలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, వామపక్షాల అభ్యర్థ్ధిగా లెక్చరర్ కూర ప్రభాకర్ పోటి చేసినప్పటికి పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థ్దికి మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లేక్కించారు. గెలుపుకు అవసరం అయిన మ్యాజీక్ ఫిగర్‌కు ఎవ్వరు చేరుకోలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లేక్కింపు అనివార్యం అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థ్ది తీన్మార్ మల్లన్న ను ఎలిమినేట్ చేసి ఓట్లను లెక్కించారు. మొత్తం లక్షా53వేల547 ఓట్లు పోల్ కాగా 14039 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 5956 మంది నోటాకు ఓట్లు వేశారు. ఇకా లక్షా51వేల413 ఓట్లు చెల్లుబాటు అయ్యా యి. పోలైన ఓట్లలో యాభైశాతం కన్నా ఒక ఓటు అధనంగా వచ్చిన గెలిచినట్లుగా భావిస్తారు. మ్యాజీక్ ఫిగర్ 66777 ఓట్లకు గాను టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 67183 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థ్ధికి 55243 ఓట్లు లభించాయి.దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప బిజెపి అభ్యర్థ్ది ఎర్రబెల్లి రాంమోహన్‌రావుపై 11,940ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. తొలి ప్రాధాన్యత ఓట్లలలో పల్లా 59764 ఓట్లను దక్కించుకొని మొదటి స్థ్దానంలో నిలిచినప్పటికి మ్యాజీక్ ఫిగర్‌కు చేరుకోలేదు. రెండోస్థ్ధానంలో నిలిచిన బిజెపి అభ్యర్థ్ధికి 47041, కాంగ్రెస్ అభ్యర్థ్ది తీన్మార్ మల్లన్నకు 13033, వామపక్షాల అభ్యర్థ్ధి కూన ప్రభాకర్‌కు 11580 ఓట్లు పోల్ అయ్యాయి. మిగిలిన 18మంది స్వతంత్ర అభ్యర్థులందరికి కలిపి 2155 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 22మందిపోటీలో ఉండగా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్యనే పోటీ నెలకొంది.
ఈసారి రంగంలో 71 మంది ఉన్నప్పటికి ప్రధాన పోటీ టిఆర్‌ఎస్, తెలంగాణ జనసమితిల మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నప్పటికి జిల్లాలో పార్టీ నిర్మాణం అంతగా బలంగా లేదు. అయినప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే పల్లా విజయం సాధించారు. ఈసారి తొలి ప్రాధాన్యత ఓట్లతోనే బైట పడాలనే ధృడ సంకల్పంతో టిఆర్‌ఎస్ శ్రేణులు పట్టుదలతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు 5.55.565 ఓట్లు ఉండగా అందులో టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు దాదాపు లక్షన్నర ఓట్లను చేర్పించారు. ఐదులక్షల ఓట్లలో మూడు లక్షల ఓట్లు పోల్ చేయించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.ప్రతి 50వేల ఓట్లకు ఒకరిని ఇంచార్జ్‌గా నియమించారు. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అధిక ఓట్లు ఉండటంతో వాటిపైనే దృష్టి కేంద్రికరించారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే 12 జిల్లాలో టిఆర్ ఎస్ పార్టీకి ఉన్న నెట్‌వర్క్ ఇతర పార్టీల్లో లేదు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పెరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపిపిలు, జెడ్పీటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, పార్టీ మండల, జిల్లా,నియోజకవర్గ నాయకులు పనిచేస్తున్నారు. దీంతో తన విజయం నల్లేరు మీద నడకేననే ధీమాతో అభ్యర్థి పల్లా ఉన్నారు. బిజెపి అభ్యర్థ్ధికి ప్రారభంలో ఉన్న ఊపు ఇప్పుడు లేకుండాపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆ పార్టీకి ప్రతిబంధకంగా ఉన్నాయి.రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డిజీల్, గ్యాస్ బండ ధరలు పెరుగుదల, మరో వైపు రైతు వ్యతిరేక చట్టాల, పలు ప్రభుత్వ రంగ సంస్థ్ధల మూసివేత,ప్రయివేటీకరణ నిర్ణయాలు ఈఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపబోతున్నాయి. ఇక ఉద్యోగాల నియమకాలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన గడిచిన ఆరేళ్ళ కాలంలో లక్షా37వేల ఉద్యోగాలను కల్పించామని, ప్రైవేట్ రంగంలో మరో ఐదులక్షల ఉద్యోగాలను కల్పించాని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పూర్తి స్థ్దాయి లెక్కలతో సహ బహిరంగ లేఖను విడుదల చేయడం, త్వరలో నిరుద్యోగ భృతిని ప్రకటిస్తామని హామి ఇవ్వడం,ఉద్యోగులందరికి తృప్తి పరిచే పి ఆర్ ఎసిని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామి ఇవ్వ డం టిఆర్‌ఎస్ అభ్యర్థ్దికి సానుకూల అంశాలుగా మారాయి.మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థ్ధులు, ఇతర తెలంగాణ ఉద్యమ కారులంతా రెండో ప్రాధాన్యత ఓట్లపైనే గంపెడు ఆశపెట్టుకొని విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News