Tuesday, April 16, 2024

లండన్‌లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -
“వీ స్టాండ్ విత్ కవిత అక్క” అంటూ మద్దుతు తెలిపిన ప్రవాసులు

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాక్ మహిళా విభాగం సభ్యులు కవిత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డ కవిత గారు మన తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఆదర్శమైన నాయకురాలని, మాలాంటి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, మహిళల హక్కులైన పోరాటాం చేస్తున్న ధీర వనితని , అలాంటి నాయకురాలి పైన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలని ఎన్నారైలంతా వ్యతిరేకిస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా మా వెంటే ఉంటూ మమల్ని ప్రోత్సహిస్తున్న కవితక్క వెంట మేమంతా ఉన్నామని, “వీ స్టాండ్ విత్ కవిత అక్క” (#WeStandWithKavithaAkka) అనిమహిళలంతా నినదించారు.

కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఎలాంటి సమస్యలొచ్చినా దైర్యంగా ఎదుర్కొని నిలబడే శక్తి గల ధీర వనిత కవిత గారని, ఇటీవల ఢిల్లీ వేదిక ద్వారా మహిళా బిల్లు కై చేప్పట్టిన దీక్షకు ప్రవాసులంతా మద్దత్తు తెలుపుతున్నామని, మా పక్షాన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మహిళా బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి, మహిళా లోకానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తునట్టు సుప్రజ తెలిపారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్ట సభల్లో కూడా న్యాయపరమైన వాటా రావాలని సుప్రజ తెలిపారు. కవితక్క మేమంతా మీ వెంట ఉన్నామని మద్దత్తు తెలిపారు. ఈ వేడుకల్లో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి తో పాటు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, పావని కడుదుల, క్రాంతి, స్నేహ,శ్వేతా, మౌనిక, నంతిని, మమతా, హారిక రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News