Friday, April 19, 2024

గత ఎన్నికల్లో బండ్ల గణేష్ జోకర్ ఉండేవారు.. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు

- Advertisement -
- Advertisement -

MLC Kavitha criticises Bandi sanjay

 

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/హైదరాబాద్: గత గ్రేటర్ ఎన్నికల్లో జోకర్ బండ్లగణేష్ ఉండేవారని శానమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. ఆదివారం గాంధీనగర్, బోరబండ డివిజన్లలో కల్వకుంట్ల కవిత విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ గతగ్రేటర్ ఎన్నికల్లో జోకర్ బండ్ల గణేష్ చేసిన జోక్‌లతో ప్రజలు హాయిగా నవ్వుకునే వారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో బండ్లగణేష్‌కు మించి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని కవిత అన్నారు. బిజెపి ఓట్ల కోసం హైదరాబాద్‌లో మతరాజకీయాలు చేస్తుందన్నారు. బండ్లమీద ముగ్గురు వెళ్లినా, తాగివెళ్లినా చాలన్లు తానేకడతానని బండి సంజయ్ జోకులు చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఎవరు ఏమి మాట్లాడినా ప్రజలతో ఉంటూ ప్రజలకు భద్రత కల్పిస్తూ అభివృద్ధి చేసిన టిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలంతా ఓట్లు వేయాలని కవిత విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకోసం టిఆర్‌ఎస్ పనిచేస్తుందని చెప్పారు. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గినా పేద వాళ్లకు నెలకు రూ.15 వందలు ఇచ్చి ఆదుకున్న ఏకైకప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని చెప్పారు.

సహాయం అందని వరద బాధితులకు డిసెంబర్ 7 నుంచి వరదసహాయం అందుతుందని కవిత చెప్పారు. రాష్ట్రానికి ఒక్కపైసా కూడా తీసుకురాని బిజెపి నాయకులు కూడా మాట్లాడుతున్నారన్నారు. బిజెపిఅధికారంలో ఉన్న బెంగుళూరులో ఉచితంగా మోట్రో రైలు సదుపాయం కల్పించని బిజెపి హైదరాబాద్‌లో కోతలు కోస్తుందన్నారు. దశాబ్దాల నుంచి బోరబండలో ప్రజలకు ఇబ్బందిగా మారిన భూముల సమస్యలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. డిసెంబర్ ఒకటిన జరిగే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలంతా టిఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచి కారును పరుగులు పెట్టించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో పలుబస్తీల్లో కవిత పాదయాత్రచేస్తూ ప్రజలను పలకరిస్తూ ముందుకు కదిలారు. వందలాది మంది ప్రజలు కవిత కు స్వాగతం పలికారు. మహిళలు కవితకు బొట్టుపెట్టి స్వాగతం పలికారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News