Wednesday, April 24, 2024

మోడీకి భయపడే ప్రసక్తే లేదు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కన్నా ముందే తెలంగాణకు ఇడి వచ్చిందని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. ఢిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఇడి అధికారులు చేర్చిన నేపథ్యంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెబుతామన్నారు. మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను.. మీ పంథాను మార్చుకోవాలని సూచించారు. కేసులు పెట్టుకోండని, అరెస్ట్ చేసుకోండని, జైల్లో పెట్టుకోండని, భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పిఎం మోడీ పడగొట్టారని దుయ్యబట్టారు. బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజెపి కుట్రలు చేస్తుందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద మంత్రులు, ఎంఎల్‌ఎల మీద మోడీ ప్రభుత్వం కేసులు పెట్టిందని కవిత దుయ్యబట్టారు. బిజెపిది హీనమైన సంస్కృతి అని ద్వజమెత్తారు.

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో సౌత్ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని ఇడి వెల్లడించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News