Wednesday, April 24, 2024

చైనాలోన్ అప్లికేషన్ బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha in support of China Lone application victim family

 

యాప్‌ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్‌కు చెందిన చంద్రమోహన్
ఆయన భార్యకు ఉద్యోగం కల్పించడంతో పాటు ముగ్గురు ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చే వరకూ చదివిస్తానని హామీ ఇచ్చిన కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చే ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. భర్తను కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్న సరితకు భుజం తట్టి భరోసానిచ్చారు. చైనాలోన్ అప్లికేషన్‌ల వేధింపులకు బలైన కుటుంబానికి ఆమె బాసటగా నిలిచారు. ఉద్యోగంతో పాటు ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తీసుకుంటానని బాధితుడి భార్యకు కవిత హామీ ఇచ్చారు.

మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన చంద్రమోహన్, చైనాలోన్ అప్లికేషన్ ల వేధింపులను భరించలేక జనవరి నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు కంటే ఆరు రెట్లు చెల్లించినా ఇంకా పదే పదే ఫోన్లు చేసి వేధిస్తుండటంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చంద్రమోహన్ భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న కవిత చంద్రమోహన్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆదివారం హైదరాబాద్‌లో సరిత, తన ముగ్గురు పిల్లలు కవితను కలిసారు. సరితను ఓదార్చిన కవిత వారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించేవరకూ సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని సరితకు ఆమె భరోసానిచ్చారు. తన కుటుంబాన్ని ఆదుకుని, పూర్తిగా అండగా ఉంటానని హామి ఇచ్చిన కవితకుసరిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News