Wednesday, April 24, 2024

ముస్త్యాల సర్పంచ్‌కు ఎమ్మెల్సీ కవిత ఫోన్

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Phone to Mustyala Sarpanch ramagiri lavanya

రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్యకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం ఫోన్ చేసి అభినందించారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ స్టార్ రికార్డ్ సంస్థ సర్పంచ్ లావణ్య చేస్తున్న సామాజిక కార్యక్రమాలను గుర్తించి ప్రేరణ రాష్ట్ర అవార్డును అందజేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఆమెకు స్వయంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులో పెద్ద మనసుతో సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందిస్తున్న లావణ్య మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.

MLC Kavitha Phone to Mustyala Sarpanch ramagiri lavanya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News