Home తాజా వార్తలు అత్యాచార ఘటన బాధాకరం : ఎంఎల్ సి కవిత

అత్యాచార ఘటన బాధాకరం : ఎంఎల్ సి కవిత

MLC Kavitha respond over Nizamabad rape case

 

హైదరాబాద్: నిజామాబాద్‌లో మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఉపేక్షించకుండా వెంటనే నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులకు అభినందనలు.సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో షీ టీమ్‌లను ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నారని గుర్తుచేశారు. మహిళలపై వివక్ష చూపిన, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయదు. నిజామాబాద్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలికి ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగా అన్ని అండగా నిలుస్తామని ఆమె వెల్లడించారు.

MLC Kavitha respond over Nizamabad rape case