Home తాజా వార్తలు మండలిలో ఎమ్మెల్సీ నారదాసు పాట

మండలిలో ఎమ్మెల్సీ నారదాసు పాట

NARADASU

హైదరాబాద్ : శాసనమండలిలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాట పాడారు. మిషన్ కాకతీయపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన తెలంగాణోద్యమ కాలంనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో నీటి కోసం పడ్డ గోస గురించి పాట పాడారు.తలాపున పారుతుంది గోదారి, మన చేళ్లు,మన చెలకలు ఏడారి అని పాడుకునే వారి మని ఆయన పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకం చేపట్డడం వల్ల ఆ పాటలు పాడుకునే పరిస్థితి పోయిందన్నారు. చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. చెరువుల కింద భూములన్నీ సాగులోకి వచ్చాయన్నారు.