Home ఖమ్మం పండుగలా టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం : పల్లా

పండుగలా టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం : పల్లా

Palla Rajeshwar Reddyఖమ్మం : తెలంగాణలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓ పండుగలా జరుగుతుందన టిఆర్ఎస్ ఎంఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యాబై వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యేలా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. బుధవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం  కెసిఆర్ అందరినీ ఐక్యం చేశారని ఆయన కొనియాడారు. సంక్షేమ ఫలాలు అందరింకీ అందేలా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా సభ్యత్వ నమోదు పూర్తవుతుందన్నారు. అనంతరం బూత్, గ్రామ, మండల కమిటీలను ఎన్నుకుంటామని, ప్రతి కమిటీలో ఎస్ సి, ఎస్ టి, బిజిలకు 51 శాతం రిజర్వేషన్లు కలిపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని, తెలంగాణలో ఇస్తున్నామని ఆయన తెలిపారు.

MLC Palla Comments On TRS Membership Registration