Home నాగర్ కర్నూల్ రేపే ఉపాధ్యాయ ఎంఎల్‌సి పోలింగ్

రేపే ఉపాధ్యాయ ఎంఎల్‌సి పోలింగ్

జిల్లాలో 18 పోలింగ్  కేంద్రాల ఎర్పాటు
2050 మంది  పోలీసులతో బందోబస్తు
8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల  వరకు ఓటింగ్
సోషల్ మిడియాలో అభ్యర్థుల ప్రచారంపై నిషేదం
పోలింగ్ కేంద్రాల  వద్ద 144 సెక్షన్
జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎస్‌పి రెమా రాజేశ్వరి

Collector

మహబూబ్‌నగర్ క్రైం:ఈనెల 9న జరిగే ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్‌కు జిల్లాలో 18పోలింగ్ కేంద్రాలను ఎర్పా టు చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ చెప్పారు. పోలింగ్ విధానం పూర్తయ్యేంత వరకు పోలింగ్ కేంద్రాలలో వీడియో లైవ్ ఉంటుందని అన్నారు.ఈ లైవ్‌ను ఒక నోడల్ అధికారి అన్ని పోలిం గ్ కేంద్రాలను సూపర్ వైజింగ్ చేస్తారన్నారు. మంగళవారం కలెక్టరే ట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారు 3448మంది ఉన్నారని తెలిపారు. అన్ని పోలింగ్ కేం ద్రాలలో ఉదయం 8 గంటలకే ఓటింగ్ మొదలవుతుందని అన్నారు. పోలింగ్ విధానం పై ప్రచారం నిషేదించినట్లు
కలెక్టర్ ప్రకటించారు.వీటిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు.వాట్సాప్ షేరింగ్‌లో ఎన్నికల ప్రచారం చేయారాదని అన్నారు.వీటి పై కూడ పోలీస్ యంత్రాంగం వెబ్‌సైట్‌పై నిఘా ఉంచిందని అన్నారు.ఉపాధ్యాయసం ఘాలు,రాజకీయ నాయకులు పోలింగ్ కేంద్రాల ముందు గుమిగూడరాదని అన్నారు.మహబూబ్‌నగర్ పట్టణంలో ఓటర్లు అధికంగా ఉన్నారని అందు కోసం పోలింగ్ కేంద్రాలలో మూడు పోలింగ్ యంత్రాలను ఎర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.పోలింగ్ కేంద్రాల ముందు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో తాగునీటి వసతి ఎర్పాటు చేశామని అన్నా రు. మధ్యాహ్నం సమయంలో ఎండాలో ఓటింగ్‌కు వచ్చే వారి కోసం మజ్జిగ ఇచ్చే ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.మాడల్ పోలింగ్ కూడా నిర్వహించినట్లు అయన తెలిపారు.

పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఎర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఓటు హక్కును వినియోగించుకునే వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చెటప్పుడు తప్పని సరిగా ప్రభుత్వ గుర్తింపుపోందిన గుర్తింపు కార్డును ఏదైన వెంట తీసుకురా వాలని అన్నారు.పోలింగ్ కేంద్రాలలోకి మోబైల్ ఫోన్‌లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తు వులు అనుమతించబడవని తెలిపారు.వీటిని ఎప్పటికప్పుడు పర్యావేక్షించేందుకు 18 ఫ్లాయింగ్ స్కాడ్స్ బృందాలు,18 మంది స్పెషల్ అధికారులు.జిల్లా స్థాయి ఎగ్జుక్యూటివ్ మానిటరింగ్ కమిటి,8మంది సెలక్టోల్ అధికారులు,8 మంది రూ ట్ అధికారుల,10 నోడల్ బృందాలు, 18 పోలింగ్ కేంద్రాలలో 18 ప్రిసైం డింగ్ అధికారులతో పాటు మరో 49మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. 20న ఓట్ల కౌంటంగ్ హైదారాబాద్‌లో జరుగుతుందని వివరించారు. ఎన్నికలు శాంతియూత వాతవరణం జరిగేల ప్రజలు సహకరించాలని కోరారు.జిలా ఎస్‌పి రెమా రాజేశ్వరి మాట్లాడుతూ.ఎంఎల్‌సి ఎన్నికలలకు జిల్లా వ్యాప్తంగా 2050 మందితో బందోబస్తు ఎర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ బందో బస్తులో డిఎస్‌పితో పాటు స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. మోబైల్ టీంలు ఎప్పటికప్పుడు అన్నిపోలింగ్ కేంద్రాలను మోబిలైజ్ చేస్తాయన్నారు.

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఈనెల 9న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎమ్.శ్రీధర్, ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్‌లు వెల్ల ంచారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్‌లో కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా విలేఖరుల సమావేశం నిర్వహించారు.

14 పోలింగ్ స్టేషన్లు : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో 1361 మంది ఓటర్లు ఉన్న ట్లు 14 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. 100 ఓటర్ల కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నవి నాలుగు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్లలో తక్కువగా 11 ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. అత్యధికంగా నాగర్‌క ర్నూల్‌లోని పోలింగ్ స్టేషన్‌లో అత్యధికంగా 353 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుం దన్నారు. పోలింగ్ స్టేషన్లు ఉన్న ప్రాంతాలలో బుధ, గురు వారాల్లో సెలవు ప్రక టించినట్లు కలెక్టర్ వెల్లడించారు. 1361 మంది ఓటర్లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ ల్లో పని చేస్తున్న వారందరికి సెలవు ఉంటుందన్నారు.

ఈ రోజు సాయంత్రం తర్వాత ప్రచారానికి వచ్చిన బయటి వ్యక్తులు వెనుదిరిగి వెళ్లిపోవాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో రెండేసి పోలింగ్ ఓటింగ్ కంపార్టు మెంట్లు ఏర్పాటు చేసామన్నారు. ప్రతి ఓటర్‌కు ఓటర్ స్లిప్‌లు అందజేసామని విధిగా దాన్ని వెంట తీసుకురావాలన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన 9 డ్యాకుమెంట్లతో ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని కేంద్రానికి చెందిన ఓ మైక్రో అబ్జర్వర్ కూడా పరిశీలిస్తారన్నారు. ఎస్పీ కల్మేశ్వర్ సింగెన వార్ మాట్లాడుతూ 14 పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న బందోబస్తు 163 మంది సిబ్బందిని నియమించాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు డిఎస్పీ స్థాయి అధికారితో స్పెషల్ స్ట్రేకింగ్ ఫోర్స్, సిఐ స్థాయి అధికారితో స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్సైతో రూట్ మొబైల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం సాయంత్రం నుండి మద్యం దుకాణాలను మూసి వేయాలని ఆదేశించామని కూడా ఎస్పీ తెలిపారు. విలేఖరుల సమావేశంలో జేసి సురేందర్ కరణ్ పాల్గొన్నారు.