Home Default వృద్ధదంపతులకు ఇంటిని నిర్మించి ఇచ్చిన ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

వృద్ధదంపతులకు ఇంటిని నిర్మించి ఇచ్చిన ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

KTRమంచిర్యాల: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిరుపేద వృద్ధదంపతులకు  ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ ఇంటిని నిర్మించి ఇచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా  జిల్లా పరిధిలోని కోటపల్లికి చెందిన వృద్ధ దంపతులు రాగం మల్లయ్య, పోసక్కల చేత గృహ ప్రవేశం చేయించారు. మంత్రి కెటిఆర్‌ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకుంటూ సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందని పురాణం సతీష్‌ తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో కెటిఆర్ వర్థిల్లాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, ప్రజా సేవలో కొనసాగాలని సతీష్ ఆకాంక్షించారు. కెటిఆర్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.