Wednesday, November 6, 2024

కరోనాతో ఎంఎల్‌సి చల్లా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఎపి ఎంఎల్‌సి చల్లా రామకృష్ణారెడ్డి కరోనా వైరస్‌తో కన్నుమూశారు. డిసెంబర్ 13న కరోనా వైరస్ సోకడంతో ఆపోలో ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చల్లా రామకృష్ణా రెడ్డి మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచారు. 1983, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఎల్‌ఎగా గెలిచారు. 1991 నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమినిచవిచూశారు. 2019 ఎన్నికల సమయంలో టిడిపికి గుడ్‌బై చెప్పి వైసిపిలో చేరారు. వైసిపి అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో చల్లా కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News