Home తాజా వార్తలు పోలీసులను చితకబాదిన మందుబాబులు

పోలీసులను చితకబాదిన మందుబాబులు

Mob Attacks

మనతెలంగాణ/గోషామహల్: రోడ్డుపై బహిరంగంగా మద్యం సేవించవద్దని వారించిన పోలీసులపై అల్లరిమూక సామూహిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఓ ఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలకు గురయ్యారు. ఈ సంఘటన సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజా మున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. శుక్రవారం రాత్రి బొగ్గులకుంటలో జరిగిన ఓ విందుకు శంషాబాద్ నుండి వచ్చిన 10 మంది మూక (పేర్లు ఇంకా తెలియలేదు) రోడ్డుపై కూర్చుని బహిరంంగా మద్యం సేవిస్తున్నారు. కాగా విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ మాధవరెడ్డి, ఇద్దరు కాని స్టేబుళ్లతో కలిసి నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని గమనించి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

అప్ప టికే మద్యం సేవించిన వారు పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా అక్కడే కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీంతో వారి వద్దకు వెళ్లి వెంటనే ఇ క్కడి నుంచి వెళ్లిపోకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఆగ్రహించిన అల్లరిమూక పోలీసులపై దాడికి పాల్పడటంతో ఎస్‌ఐ మాధవరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఫోన్ ద్వారా ఎస్‌ఐ మాధవరెడ్డి ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డికి సమాచారం అందించారు. దీంతో స్పందించి న ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి పోలీసు బలగాలను రప్పించి, దాడికి పాల్పడిన 10 మంది మూకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయాలైన కానిస్టేబుళ్లకు ఉస్మానియాలో చికిత్స చేయించారు.
ఉక్కుపాదం మోపుతాం: ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి అన్నారు. విధి నిర్వహణతో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన మూకపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా పోలీసు విధులకు అంతరాయం కల్గించినా, రోడ్లపై న్యూసెన్స్ సృష్టించినా, నిబంధనలను విరుద్దంగా బహిరంగ మద్యం సేవించే అసాంఘిక శక్తుల పీచమణిచేస్తామన్నారు.

Mob Attacks on Police in Hyderabad