Home జాతీయ వార్తలు యుపిలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో సెల్‌ఫోన్లపై నిషేధం

యుపిలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో సెల్‌ఫోన్లపై నిషేధం

UP CM Yogiలక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఉన్నత విద్యా డైరెక్టరేట్ ఒక సర్కులర్‌ను శుక్రవారం జారీచేసింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులు ఇక యూనివర్సిటీలు, కళాశాలల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లకూడదు. ఈ నిషేధం టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెనర్లకు కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మరింత మెరుగైన బోధనా వాతావరణాన్ని తీసుకురావడానికే ఈ చర్య చేపటినట్లు డైరెక్టరేట్ తెలిపింది. బోధనా సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు తమ విలువైన కాలాన్ని మొబైల్ ఫోన్లకే వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కాగా, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ క్యాబినెట్ సమావేశాలతోసహా అన్ని అధికారిక సమావేశాల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఇదివరకే నిషేధించారు. ముఖ్యమైన సమావేశాలు జరుగుతున్న సమయంలో కొందరు మంత్రులు, అధికారులు తమ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సందేశాలను చూస్తుండడంతో యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Mobile Phones Ban In All Colleges And Universities In Up
UP govt bans use of mobile phones in all colleges and universities, the higher education directorate of UP has issued a circular regarding ban of usage of mobile phones in colleges and universities