Home తాజా వార్తలు పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు…

పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు…

Mobile-Usersఉపాధి కోల్పోతున్న, ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు
పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు.. మూతపడుతున్న ఇంటర్నెట్ సెంటర్లు

హైదరాబాద్: నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ప్రపంచం అంతా స్మార్ట్ ఫోన్ గుప్పిట్లో ఇమిడి పోయిం ది.దాంతో ప్రపంచంలోని అనేక అంశాల సమాచారం క్షణాల్లో మన అరచేతిలో ఉంటున్నాయి. ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ అనేది ప్రతి మనిషికి నిత్యావసర వస్తువుగా మారింది. గత కొన్ని సంత్సరాలుగా ఇంటర్నెట్ అనేది ప్రజల జీవితాల్లో ఒక భాగమై పోయింది. ముఖ్యంగా విద్యార్థులు తమ పాఠశాలల్లో , కళాశాలల్లో ఇచ్చే అసైన్ మెంట్ , ప్రాజెక్టు వర్క్ పూర్తి చేయాలన్నా, రైల్ ,బస్సు మొదలుకు సినిమా టికెట్స్ వరకు బుక్ చేసుకోవాలన్నా, తమకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్,చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా ప్రపచంలో ఏ మారు మాల ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలన్నా కంప్యూట్ ద్వారా ఇంటర్ నెట్‌ను ఉపయోగించుకునే వారు. దాంతో నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇంటర్నెట్ కేంద్రాలు వెలిశాయి.

నగర వ్యాప్తంగా ప్రతి ఏరియాల్లో ఒకటి నుంచి 10 వరకు ఇంటర్నెట్ కేంద్రాలు వెలిశాయి. జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు సైతం తమ కేం ద్రాలను ఇంటర్నెట్ కేంద్రాలుగా మార్చుకున్నారు. ఆయా కేంద్రాలు ఎప్పుడు కస్టమర్లతో బిజీగా ఉండేవి. ఇంటర్నెట్ వినియోగించుకున్నందుకు నిర్వాహకు లు ఇంటర్నెట్ స్పీడ్‌ను బట్టి ఒక గంటకు రూ. 30 నుంచి 50 వరకు చార్జ్ వ సూలు చేశారు. ఆయా కేంద్రాల వద్ద వినియోగ దారులు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సివచ్చేది. వీటి నిర్వాహ ణ ద్వారా నిర్వాహకులకు ఆదాయం కూడా బాగానే ఉండేది. వీటి ద్వారా ఇంటర్నెట్ నిర్వాహకులకు నెలకు అన్ని ఖర్చులు పోను సుమారు రూ. 25 నుంచి 50 వేల వరకు ఆదాయం వచ్చేది. మంచి సెంటర్లల్లో అయితే నెలకు రూ. 1 లక్ష వరకు ఆదాయం లభించేది.

పెరుగుతోన్న స్మార్ట్ ఫోన్ల వినియోగం… 

రోజు రోజకు పెరుగుతోన్న సాంకేతిక విప్లవం కారణంగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒక్క ప్రింటర్ మినహ ఇంటర్నెట్ కేంద్రాల్లో ఎటువంటి సేవలు లభ్యం అవుతున్నాయో అటువంటి సేవలే స్మార్లు ఫోన్లలో లభిస్తుండటంతో వీటి ప్రభావం ఇంటర్నెట్ కేంద్రాలపై పడింది. స్మార్ట్ ఫోన్ విప్లవం రావడంతో వాటికి తగ్గట్లుగా ఇంటర్‌నెట్ సిమ్ ద్వారా ఇంటర్‌నెట్ డేటాను రీచార్జ్ చేయించుకుని సెల్‌ఫోన్లలో వారికి సంబంధించిన సమాచారాన్ని చూసుకుంటున్నారు.ఎయిర్‌టెల్, ఐడియా, తదితర సంస్థలు ఇంటర్నెట్ సిమ్‌ల మీద అనేక రకమైన ఆఫర్లు ప్రకటించడంతో పాటు వాటి రేటును కూడా తగ్గించాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైతం తమ కార్యాకలాపాలను నిర్వాహణ కోసం మోబైల్ యాప్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. బస్సు టికెట్ మొదలుకుని విమానాయాన టికెట్ వరకు, కరెంట్ బిల్లు మొదలకుని పన్నులు చెల్లించడం వరకు, సినిమా టికెట్లు బుకింగ్ మొదలుకుని ఇతర అన్ని అవసరాల కోసం ఆయా సంస్థలు యాప్‌లను అందుబాటులోకి తీసు రావడంతో వీటిని వినియోగం పెద్ద ఎత్తును పెరిగింది. ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభించడంతో సామాన్యుడు సైతం వాటిని కొనుగోలు చేసుకుని ఇంటర్‌నెట్‌ను ఫోన్లోనే వాడుతుండటంతో ఇంటర్నెట్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గి పోయింది.

భారమైన నిర్వహణ

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ కేంద్రాలకు వచ్చే వారు తగ్గిపోయారని,కనీసం షాప్ రెంట్ కాదు కదా కొన్ని సమయాల్లో కరెంట్ బిల్లు ఖర్చులు కూడా రావడం లేదని ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభించడంతో సామాన్యుడు సైతం వాటిని కొనుగోలు చేసుకుని ఇంటర్‌నెట్‌ను ఫోన్లలోనే వాడుతుండటంతో ఇంటర్నెట్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గి పోతోందని ఆయా కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. ఒకప్పడు ఎస్‌టిడీ, ఐఎస్‌డి బూత్‌లు ప్రతి వీధిలో మనకు దర్శనం ఇచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లోకి సెల్ పోన్లు రావడంతో ఎస్‌టీడీ, ఐఎస్‌డీ బూత్‌లు కూడా కనుమరగయ్యాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ కేంద్రాలు కూడా ఇదే పరిస్థితి కూడా ఇదే మాదిరిగా మారిపోయి ప్రమాదం ఉందని ప్రభుత్వమే తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారు కోరుకుంటున్నారు.

Mobile Users Increasing Effect on Internet Centers