Home జిల్లాలు మోడల్ చెరువులకు శ్రీకారం

మోడల్ చెరువులకు శ్రీకారం

plantingప్రయోగాత్మకంగా చర్లపల్లిలో
రూ.4.90 లక్షలతో నిర్మాణం
రూ.67 లక్షలతో వినాయక
నిమజ్జనం కోసం ఏర్పాట్లు
చెరువు నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేసిన మేయర్
సిటీబ్యూరో : మోడల్‌గా చర్ల పల్లి చెరువును అభివృద్ధి చేయనున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. వినా యక విగ్రహాలనునిమజ్జనం చేసేందుకు రూ.67 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా కొనేరు నిర్మిస్తున్నామని అన్నారు. రూ.4 కోట్ల 90 లక్షల వ్యయంతో చెర్లపల్లి చెరువును అభివృద్ది చేస్తామని ఆయన వెల్లడించారు. గురువారం చెర్లపల్లి చెరువులో వినాయక విగ్రహల నిమజ్జనం కోసం రూ.67 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన కొనేరు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్ ప్రభాకర్‌తో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. చెరువు దగ్గర మొక్కలు నాటారు. మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ చెరువుల పరిర క్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తు దన్నారు. అందులో భాగం గా చెరువులను అభివృద్ది చేయాలని నిర్ణయించా మన్నారు. వినాయక విగ్రహల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హైకోర్టు కూడా అదేశిం చిందన్నారు. బెంగళరు తరహాలో చెరువులో కొంత భాగంలో ప్రత్యేకంగా కొనేరు నిర్మిస్తున్నట్లు చెప్పారు. చెర్లపల్లి చెరువులో ప్రయోగత్మంగా కొనేరు నిర్మిస్తున్న మ న్నారు. వచ్చే వినాయక చవితి పండుగలోపు కొనేరు అందుబా టులోకి వస్తుంద న్నారు. ఇక్కడ ప్రయోగత్మంగా పరిశీలించిన అనంత రం నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో వినాయక విగ్రహల నిమజ్జనానికి ప్రత్యేక కొనేరులు నిర్మిస్తామ న్నారు. అన్ని చెరువుల్లో కొనేరులు నిర్మిస్తే హుస్సేన్‌సారగ్‌పై వినాయక విగ్రహల నిమజ్జనం సంఖ్య తగ్గుతుంద న్నారు. దీంతో హుస్సేన్ సాగర్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలవుతుం దన్నారు. ఈ ప్రత్యేక కొనే రుల్లో వినాయక విగ్రహల నిమజ్జనంతో పాటు బతుకమ్మలను కూడా నిమజ్జనం చేసేందుకు సౌక ర్యాలు కల్పిస్తామన్నారు. మొదటి దశలో రూ.6 కోట్ల 95 లక్షల వ్యయంతో 10 చెరువల్లో కొనేరులు నిర్మి స్తామన్నారు. చెర్లపల్లి చెరువు, హుస్సేన్‌సాగర్, కాప్రాచెరువు, కూకుట్‌పల్లిలో పార్కిచెరువు, శెరిలింగం పల్లిలో పెద్దచెరువుల, మల్కా చెరువు, నలగండ్ల చెరువు, కుత్బుల్లాపూర్‌లో వెన్నలచె రువు, సరూర్‌నగర్ చెరువులను అభివృద్ది చేయను న్నట్లు వివరించారు. చెరువుల్లో పుడికతీత, బతుకమ్మ పండుగ కోసం మెట్ల నిర్మాణం, కట్టను పటిష్టంగా చేయడం, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మిస్తామ న్నారు. పబ్లీక్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చెరువును పూర్తిస్థా యిలో సుదరిక రిస్తామన్నారు.గ్రీన్‌సెల్ఫీ… సెలబ్రెటిలు, విఐపిలతో సెల్ఫీలు దిగాలనుకునేవారు మొక్కలతో సెల్ఫీలు దిగాలని మేయర్ రామ్మోహన్ పిలుపుని చ్చారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు అందచేసి, సెల్ఫీలు దిగాలని కోరారు. దీని గ్రీన్ సెల్ఫీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. యువకులు మొక్కలతో మేయర్‌తో సెల్ఫీలు దిగారు.