Wednesday, April 24, 2024

జూన్ 6న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

Model Schools Entrance Exam on June 6

 

మనతెలంగాణ/హైదరాబాద్‌: రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి జూన్ 5న, 6వ తరగతిలో ప్రవేశాల కోసం అదే నెల 6వ తేదీన రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.75, మిగతా వారు రూ.150 చెల్లించాలని వెల్లడించింది. మరిన్ని వివరాలు తమ వెబ్‌సైట్ (http://telanganams.cgg.gov.in)లో పొందవచ్చని తెలిపింది. దరఖాస్తుల ను ఏప్రిల్ 15 నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించింది. ఇదిలావుండగా ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉంటుందని, 7 నుంచి 10 తరగతుల్లో మిగులు సీట్లకు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30 వరకు, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ జూన్ 1 నుంచి జూన్ 6 వరకు చేసుకోవచ్చన్నారు. అలాగే 7 నుంచి 10 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష జూన్ 5, ఆరో తరగతిలో ప్రవేశాలకు పరీక్ష జూన్ 6 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News