Home రంగారెడ్డి సంక్షేమంలో ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం

సంక్షేమంలో ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం

ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధికి అంకితమవుదాం
లక్ష ఎకరాలకు సాగునీరే లక్షం
అభివృద్ధికి కలిసిరండి
ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్
KTRకొండపాక : సీమాంధ్ర పాలనలో అభివృద్ధిలో వెనుకబాటుకు గురైన తెలంగాణ నేడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ భారత దేశానికే ఆదర్శంగా మారుతుందని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెలికట్ట వద్ద జరిగిన వాటర్ గ్రిడ్ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం జోడు ఎద్దుల్లాగా ముందుకు సాగు తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరుగుతుందో అదే చేసి చూపెట్టడం జరి గిందన్నారు. ఇంటింటికీ తాగునీటితో పాటు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్షంగా పనిచేస్తు న్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కలిసి రావాలని ఆయన కోరారు. ఇంటింటికీ తాగునీటి పథకం మహా యజ్ఞమని, దీని కోసం ముఖ్యమంత్రి భగీరథ ప్రయత్నం చేస్తున్నార న్నారు. వాటర్ గ్రిడ్ పథకం కోసం కృష్ణా-గోదావరి నుంచి 17 చోట్ల నీటిని సేకరించి, వాటిని 60 ప్రాంతాల్లో నీటిశుద్ధి కేంద్రాల ద్వారా గ్రామాలకు, పట్టణాలకు, తండాల కు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ అంతటా నీరందించడానికి 1.25లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ అవసరం ఉంటుందని, భూమి చుట్టూ నాలుగు సార్లు తిరిగినంత విస్తీర్ణం ఉంటుందని ఉదహరించారు. 12 వేల క్రాసింగ్‌లతో, 4 వేల పంచాయతీరాజ్ రోడ్లు, 3 వేల ఆర్ అండ్ బి రోడ్లు, రైల్వే క్రా సింగ్‌లు, హైవేలు దాటుకొని పైప్‌లైన్ వేయడం ఆశామాషి వ్యవహారం కాదని ఆయన తెలిపారు. ఆరు నూరైనా ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినట్లు మరో మూడేళ్లలో ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రూ.9.7కోట్ల డ్వాక్రా రుణాలు, రూ.2.47 కోట్ల స్త్రీ నిధి రుణాల చెక్కులను మంత్రి మహిళలకు అందించారు.
ఆకట్టుకున్న కెటిఆర్ చెప్పిన కథ …
అధికారంలో ఉన్నప్పుడు రైతులను, ప్రజలను పట్టించుకోని విపక్షాలు నేడు రాద్ధాంతాలు చేయడంపై ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈసందర్భంగా కెటిఆర్ చెప్పిన కథ బాగా ఆకట్టుకుంది. వెలికట్టెలో ఒక పిల్లగాడు ఉండే.. వానికి చిన్నప్ప టి నుంచి చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్లు..బడికి పొమ్మంటే బీడీలు తాగతూ మద్యం సేవించేవాడు. చదువు అబ్బలేదు. జులాయిగా మారాడు.. పెద్దగయినంక కూడా మార్పు రాలేదు. ఒకనాడు మద్యం కోసం డబ్బులు గుంజుకపోతే తల్లిదండ్రులు గట్టిగా పట్టు కోవడంతో అక్కడే ఉన్న రోకలిబండతో వారి తలలపై గట్టిగా కొట్టడంతో తల్లిదండ్రులు ఇద్దరూ అక్కడే మరణించారు. ఇక పోలీసులు ఊకుంటారా..కేసు చేసి నమోదు చేసి కోర్టుకు పంపించారు. కోర్టులో తీర్పు రోజున ఏం శిక్ష విధిస్తారో అని అందరూ ఎదు రు చూస్తుండగా…జడ్జి ముందు నిందితుడు సార్ తల్లి దండ్రులు లేని అనాథను సార్ మీరే కాపాడాలి అన్నడు.. గట్లనే ఉంది ప్రతిపక్షాల పరిస్థితి అని ఆయన కథ వివరించ డంతో వేదిక మీద ఉన్నవారితో సహా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు నవ్వుకున్నారు.
వాటర్ గ్రిడ్ దేశంలోనే ఆదర్శం: ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి …
ఇంటింటికి తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న పథకాలు మిగతా రాష్ట్రాలకు నమూనాగా మారుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమని ఆయన తెలిపారు. ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేని ప్రతిపక్షాల పరిస్థితి కండ్లుండి కూడా గుడ్డివారిగా మారిన చందంగా మారిందన్నారు. రాష్ట్ర శాస నసభ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుంద న్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని ప్రజా సంక్షేమంలో భాగస్వా మ్యం కావాలన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్, ఆర్‌డబ్లుస్ సిఇ సురేందర్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్ ఎర్రగొళ్ల రాజమణి, జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేం దర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఆర్‌డబ్లుస్ ఎస్‌ఇ విజయప్రకాశ్, డిఆర్‌డిఓ పిడి సత్యనారాయణరెడ్డి, గడ ప్రత్యేకాధికారి హన్మంతరావు, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మడుపు భూంరెడ్డి, జడ్‌పిటిసి చిట్టి మాధురి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపిపి అనంతుల పద్మ, ఆర్‌డబ్లుస్ డిప్యూటీ ఇఇ రాజయ్య, ఎఇ రవి ప్రకాశ్, ఎంపి డిఓ ఆనంద్‌మేరీ, తహసీల్దార్ విజయభాస్కర్, సర్పంచ్‌లు గొడుగు యాదగిరి, నర్సింలు, మల్లవ్వ, పెద్దం కుల శ్రీనివాస్, యాదగిరి, ఎల్పుల యాదయ్య, లావణ్య, ఐలంయాదవ్, బాల నర్సయ్య, నర్సింహ్మారెడ్డి ఎంపిటిసిలు కృష్ణవేణి, భూదవ్వ, మల్లేశం, నర్సింలు, సద్గుణ, బాలమణి, యాదగిరి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.