Friday, July 12, 2024

రానున్న రెండ్రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు

- Advertisement -
- Advertisement -

Moderate rains

 

హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలో మార్పు కనిపిస్తోంది. మరక్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి, మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయని తెలిపింది. నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది.

Moderate rains in todays
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News