Home లైఫ్ స్టైల్ ఈసురోమని మనుషులుంటే…

ఈసురోమని మనుషులుంటే…

life

పోషక తిండి లేమితో బాధపడుతున్న ఆధునిక భారతం 

తొలిసారి గర్భం ధరించే స్త్రీలలో అధిక శాతంమంది అప్పుడేయుక్తవయసుకువచ్చిన అమ్మాయిలు. వారి శరీరం ఇంకా గర్భధారణకు అనువుగా ఉండదు. వీరిలో  దాదాపు 75 శాతం మంది రక్త   హీనతను క లిగి ఉంటారు. చిన్న వయసు నుండి ఆడపిల్లల పట్ల మన  సమాజం చూపే వివక్ష   వారు తినే ఆహారంపై, వారి ఎదుగుదలపై, వారి   అవగాహనా సామర్ధ్యంపై ఎంతో చెడు      ప్రభావాన్ని  చూపిస్తుంది. దీనితో వారు తమ శరీరాలపై, తాము  తీసుకోవలసిన ఆహారంపై,   బిడ్డల సంరక్షణపై ఏమా త్రం అవగాహన లేక తమ పోషణ, తమ బిడ్డల పోషణ కూడా సరిగా    చేసుకోలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గర్భం ధరిం చిన స్త్రీలు గర్భం ధరించిన సమయం నుండి ప్రసవ సమయానికి మధ్య దాదాపు పది కిలోల బరువు పెరుగుతుండగా మన దే శంలో      స్త్రీలు సరాసరి ఐదుకిలోలు మాత్రమే పెరుగుతున్నారని సర్వేల ద్వారా తెలుస్తుంది. ఇలా         పోషకారలోపంతో,  అ వగాహన లేమితో  యుక్త వయసులోనే  తల్లులవుతున్న స్త్రీలు తక్కువ బరువు ఉన్న బిడ్డలకు జన్మనివ్వడం ద్వారా పోష కా హారలోపం అనే ఒక విష విలయానికి తెరతీస్తున్నారు.

రెండున్నర సంవత్సరాల వయసున్న పల్లవి కేవలం ఆరున్నర కిలోల బరువు మాత్రమే ఉంది. ఆమె వయసు పిల్లలు నిజానికి కనీసం ఎనిమిది కిలోల బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక పేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన పల్లవి పుట్టుకతోనే ఇలా తక్కువ బరువుతో లేదు. చక్కగా, ఆరోగ్యంగా, దాదాపు రెండున్నర కిలోల కన్నా కొంచం ఎక్కువ బరువుతో పుట్టింది. అయితే పెరిగే కొద్దీ ఆ అమ్మాయి తగిన పోషణ లేక, వయసుకు తగిన బరువు లేక, చీటికీ మాటికీ అనారోగ్యాలతో బలహీనంగా తయారయ్యింది.
పల్లవిలాగా పోషకాహార లోపంతో, తక్కువ బరువుతో, వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేకుండా తరచు అనారోగ్యాలకు గురవుతూ ఉన్న పిల్లలుమన దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు భారతదేశంలో చైనా కన్నా ఐదు రెట్లు ఎక్కువగాను, సబ్- సహారాన్ ఆఫ్రికన్దేశాల కన్నా రెండు రెట్లు ఎక్కువగాను ఉన్నటు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలలో దాదాపు సగం మంది తక్కువ బరువు కలిగి ఉండగా, 45 % మంది వారి వయసుకు తగిన ఎత్తు లేకుండా, 25 % మంది ఎత్తుకు తగిన బరువు లేకుండా ఉన్నారు. 75 % పిల్లలు రక్తహీనతతో బాధపడుతుండగా, 57 % మంది విటమిన్ ఎ లోపం కలిగి ఉన్నారు. వివిధ వ్యాధులపై అంతర్జాతీయ స్థాయిలో 2016 లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆ ఒక్క సంవత్సరంలోనే మన దేశంలో ఐదు సంవత్సరాలలోపు వయసు గల పిల్లలలో దాదాపు 9 లక్షల మంది మరణించారంటే మనపిల్లలలో పోషకాహారలోపం, వ్యాధి నిరోధకశక్తి లోపం ఏస్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
పోషకాహార లోపం అనేది పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తుంది. వారిలో వ్యాధి నిరోధక శక్తిని, కొత్తవిషయాలను నేర్చుకునే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనితో పిల్లలు చదువుకునేందుకు ఆసక్తి చూపక ఎంతో మంది చదువును మధ్యలోనే ఆపి వేయడం జరుగుతుంది. దీనితో వారి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆరోగ్యంపై, చదువుపై, భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై ఇంతగా ప్రభావం చూపే పోషకాహార లోపం అనే సమస్యని నిర్లక్ష్యంచేస్తే మానవాభివృద్ధి సూచికలపై, దేశ ఆర్ధికపురోగతిపై అది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనేది వాస్తవం.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఒక వ్యక్తిజీవితంలో మొదటి వెయ్యి రోజులు, అంటే తల్లి గర్భం దాల్చిన సమయం నుండి ఆ వ్యక్తికి రెండవ సంవత్సరం నిండేవరకు ఉండే సమయం ఆ వ్యక్తి మానసిక, శారీరక, వైయక్తిక ఎదుగుదలకు ఎంతో కీలకం. ఈ కీలక దశలో లభించే పోషకాల మీదనేవ ్యక్తి వికాసం ఆధారపడి ఉంటుంది. అయితే అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం దేశంలో గర్భధారణకు అనుకూలమైన వయసులో ఉన్న స్త్రీలలో సగంకి పైగా రక్తహీనతతో బాధపడుతున్నట్లు, దాదాపు 33 శాతం మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.
2011లో నాంది ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ దేశంలోని 112 జిల్లాలలో నిర్వహించిన హంగామా (హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్) అనే సర్వే నివేదిక ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 80 శాతం మంది స్త్రీలు పోషకాహారలోపం అనే మాటే వినలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇంత అవగాహనాలేమి ఉన్న దేశంలో పిల్లలు, స్త్రీలు సరైన పోషకాహారం లేక, అనారోగ్యాలతో ఈసురోమంటూ జీవితాలు గడుపుతున్నారంటే ఆశ్చర్యంఏముంది. నాణానికి మరో వైపు చూస్తే 1991 నుండి ఇప్పటికి దేశ ఆర్ధిక వ్యవస్థ రెండు రెట్లు బలపడింది. ప్రజల జీవన ప్రమాణాలు చాలా వరకు మెరుగుపడ్డాయి. పేదరిక శాతాలు బాగా తగ్గాయి. పోషకాహార లోపాన్నిఅరికట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెట్ సర్వీసెస్ (ICDS) పథకం 1975 నుండిదేశంలో అమలులోఉంది. అయినా పోషకాహార విషయంలో అతిపేదవైన ఆఫ్రికన్ దేశాలకన్నా మన దేశం ఎందుకు వెనకపడి ఉంది అనేది మన లాజిక్కుకు అందని విషయం.
దేశంలోని పేదలకు తక్కువ ధరలకే ఆహార ధాన్యాలను అందించేందుకు మనకు అతిపెద్దదైన ప్రజాపంపిణీ వ్యవస్థ ఉంది. చౌకధరల దుకాణాల ద్వారా, అన్నపూర్ణ, అంత్యోదయ వంటి పథకాల ద్వారా పేదలకు ఆహారధాన్యాలు అందించడం జరుగుతుంది. 2012 లో 12 వపంచవర్షప్రణాళికాకాలంలో ICDS పథకాన్ని పునర్వ్యవస్థీకరించి దేశంలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారామూడు నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకు అదనపు పోషకాహారాన్ని, ప్రీ-స్కూల్ విద్యని , వాక్సినేషన్ వంటి సేవలను అందించే ఏర్పాటు చేయడం జరిగింది. 2013 లో అమలులోకి తీసుకురాబడిన జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రధాన లక్ష్యం ఆహార భద్రత కల్పించడం ద్వారా పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడమే.
అయితే ఈ చర్యలన్నీ పోషకాహారలోపం అనే అతిపెద్ద సమస్యను ఎదుర్కొనేందుకు సరిపోతాయా అంటే సమాధానం దొరకదు. చాలా వరకు పోషకాహారలోపం అంటే అది పేదరికానికి సంబంధించిన విషయంగా భావిస్తారు. పేదరికం వల్ల సరైన ఆహారం తీసుకోలేని వారే ఈసమస్యను ఎదుర్కుంటారు అనేది అందరికీ ఉండే అభిప్రాయం. అయితే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలలోని స్త్రీలు, పిల్లలలో కూడా ఈ పోషకాహారలోపం అధికంగా ఉందనేది గణాంకాలు చెబుతున్న సత్యం. నిజానికి పోషకాహార లోపానికి ఏ ఒక్కటీ ్ర పధాన కారణంగా చెప్పలేము. బిడ్డపుట్టిన తొలి మూడు సంవత్సరాలలో సరైన పోషణ, సంరక్షణ లేకపోవడం ఇందుకు ఒక ప్రధాన కారణం. దీనికి తోడు సరైన పరిశుభ్రత పాటించకపోవడం, పారిశుధ్దలోపం కూడా బిడ్డలలో అనేక ఇన్ఫెక్షన్లకు కారణమై వారిలో పోషకాలులోపించేలా చేస్తున్నాయి. మరుగుదొడ్లు అందుబాటులో లేక బహిరంగ మలవిసర్జన చేసే కుటుంబాలలో ఎదుగుదల లోపం అధికంగా ఉంటున్నట్లు అనేక సర్వేలు రుజువు చేస్తున్నాయి. ఇంతేకాక, బాల్య వివాహాలు అధికంగా ఉండడం కూడా పోషకాహార లోపం మరింత పెరిగేందుకు ఒక కారణం. తొలిసారి గర్భంధ రించే స్త్రీలలో అధిక శాతంమందిఅప్పుడేయుక్తవయసుకువచ్చినఅమ్మాయిలు. వారిశరీరంఇంకాగర్భధారణకుఅనువుగాఉండదు. వీరిలోదాదాపు 75 శాతం మంది రక్త హీనతనుక లిగి ఉంటారు. చిన్న వయసు నుండి ఆడపిల్లల పట్ల మన సమాజం చూపే వివక్ష వారు తినే ఆహారంపై, వారి ఎదుగుదలపై, వారి అవగాహనా సామర్ధ్యంపై ఎంతో చెడుప్రభావాన్ని చూపిస్తుంది. దీనితో వారు తమ శరీరాలపై, తాము తీసుకోవలసిన ఆహారంపై, బిడ్డల సంరక్షణపై ఏమాత్రం అవగాహన లేక తమ పోషణ, తమ బిడ్డల పోషణ కూడా సరిగా చేసుకోలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గర్భం ధరించిన స్త్రీలు గర్భంధరించిన సమయం నుండి ప్రసవ సమయానికి మధ్య దాదాపు పది కిలోల బరువు పెరుగుతుండగా మనదేశంలో స్త్రీలు సరాసరి ఐదుకిలోలు మాత్రమేపెరుగుతున్నారని సర్వేల ద్వారా తెలుస్తుంది. ఇలా పోషకారలోపంతో, అవగాహనలేమితో యుక్తవయసులోనే తల్లులవుతున్న స్త్రీలు తక్కువ బరువు ఉన్న బిడ్డలకు జన్మనివ్వడం ద్వారా పోషకాహారలోపం అనే ఒక విష విలయానికి తెరతీస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం స్త్రీలు అక్షరాస్యత సాధించి, కుటుంబ నిర్ణయాలలో పాలుపంచుకుంటూ, సాధికారత పొందిన కుటుంబాలలో, ప్రాంతాలలో పోషకాహారాలేమి సమస్య తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీనివల్ల సమాజంలో స్త్రీల స్థాయికి, పోషకాహారానికి, పిల్లల ఆరోగ్యాలకు ఉన్న సంబంధం తేటతెల్లమవుతుంది. సరైన ఆహారం లేకపోవడమే పోషకాహారలేమికి ఒక ప్రధాన కారణం అనే అవగాహనతో గతంలో రూపొందించిన ప్రజాపంపిణీ, ICDS వంటి పథకాలన్నీ పేదలకు ఆహారాన్ని అందించడంపైనే దృష్టిపెట్టాయి. అయితే పోషకాహార లోపం అనేది ఆహార సమస్య మాత్రమే కాదు. అది బహుముఖమైంది. నిరక్షరాస్యత, స్త్రీల స్థితిగతులు, పారిశుధ్యం, పోషణపై అవగాహన లేకపోవడం, తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన లేకపోవడం, శుభ్రమైన త్రాగునీరు లభించకపోవడం, నవ జాతశిశువుల ఆరోగ్య సంరక్షణకు సరైన వసతులు లేకపోవడం ఇలా ఎన్నో అంశాలు బిడ్డల పోషణను, ఆరోగ్యాన్ని తద్వారా వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
భారత రాజ్యాగం దేశంలోని ప్రతి ఒక్కరికీ జీవించే హక్కును కల్పించింది. జీవించడమంటే ఈసురోమంటూ ఎలాగోలా జీవితాన్ని నెట్టుకు రావడం కాదు.ఆరోగ్యంగా, సంతోషంగా, దృఢంగాప్రతిఒక్కరు జీవించాలంటే పోషకాహార సమస్యపై అత్యవసరంగా దృష్టిపెట్టక తప్పదు. ఇందుకు మొదటిమెట్టు ICDS వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం. దేశంలో అంగన్‌వాడీల పనితీరు గురించి మనకు తెలియంది కాదు. అంగన్‌వాడీవర్కర్లు, హెల్పర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, ఉన్న వారికితగినంత అవగాహన, నైపుణ్యాలు లేకపోవడం, ఆహార పంపిణీలోఅవకతవకలు, చిత్తశుద్ధిలేమి ఇలాచెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు. ఈలోపాలను సరిదిద్దుకోవడమేకాక యుక్తవయసు బాలికలు, స్త్రీల ఆరోగ్యం, పోషణపై దృష్టిపెట్టాల్సిఉంది. తాగునీరు, పారిశుధ్యం, అక్షరాస్యత ఇలాఎన్నో సమస్యలను పరిష్కరించడం ద్వారామాత్రమే పోషకాహార సమస్యని సమర్ధవంతంగా ఎదుర్కోగలం. అప్పుడే పల్లవి లాంటి ఎంతోమంది పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రయోజనకరమైన పౌరులుగా ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది.ః

భారతి కోడె
9440103411