మనతెలంగాణ/రామన్నపేట: రైతులు తమ భూములు ఇచ్చి సహకరిస్తేనే కాలువల ఆధునీక రణ పనులను చేపట్టడం జరుగు తుందని స్పెషల్ డిప్యూటీ కలె క్టర్ ఆర్.శివాజి, ఆర్డీవో ఎస్. సూరజ్‌కుమార్‌లు తెలిపారు. మంగళవారం ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువల వెడల్పు వల్ల భూములను కోల్పోయే రైతులకు పరి హారం చెల్లించే విషయంపై స్థానిక తహ శీల్దార్ కార్యాలయ ఆవరణలో రామన్న పేట,సిరిపురం,వెల్లంకి గ్రామాల రైతుల తో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభు త్వ నిబంధనల ప్రకారం రామ న్నపేట రైతులకు ఎకరాకు 5 లక్షలు,వెల్లంకి రైతులకు 4.70 లక్షలు,సిరిపురం రైతు లకు 4.50 లక్ష లు చెల్లించడం జరుగు తుందని, కాలువ చివరి భూముల వర కు నీటిని అందించడం కోసమే ప్రభు త్వం కాలువ వెడల్పు చేస్తుందని వివరిం చారు. రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహా రం తక్కువ అయిన భవిష్యత్ ప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకొని సహకా రం అందించాలన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి ఆధునీక రణ పనులు పూర్తి చేసి సాగునీటిని అందించడం కోసం ప్రభు త్వం క్రాప్‌హాలి డేను ప్రకటించిం దన్నా రు. ప్రభుత్వం చెల్లించే రూ. 5 లక్షల పరిహారం తమకు వద్దని ఎకరానికి రూ. 10 నుంచి రూ. 15 లక్షల రూపాయలు చెల్లించాలని, బలవంతం తమ భూము లను లాక్కోవడానికి ప్రయత్నిస్తే పనుల ను అడ్డుకుంటామని రైతులు అధికా రులతో వాగ్వివాదానికి దిగారు. గ్రామా ల వారిగా ప్రజాప్రతినిధుల సమ క్షం లో సమావేశాలు నిర్వహించి పరి హారం ఖరారు చేసి రైతులు అంగీకరిస్తే పనులు చేపడుతామని అధికారులు హా మీ ఇచ్చారు.ఈ సమావేశంలో తహశీ ల్దార్ పి.కరుణా సాగ ర్, ఐబీడి పంతు లయ, ఎఈ రాజశేఖర్,సర్పంచ్‌లు ఎన్. మొగు లయ్య, శివరంజని పాల్గొన్నారు.
రైతులు సహకరిస్తేనే కాలువల ఆధునీకరణ
- Advertisement -
- Advertisement -