Home జాతీయ వార్తలు యువ భారతాన్ని ఎవరూ ఆపలేరు

యువ భారతాన్ని ఎవరూ ఆపలేరు

Modi attends NCC rally at cariappa ground in delhi

 

ఢిల్లీ ఎన్‌న్‌సిసి ర్యాలీలో ఎన్‌సిసి కేడెట్లకు ప్రశంసలు : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అంకుర పరిశ్రమల నుంచి క్రీచారంగం వరకు వివిధ రంగాల్లో విస్తరించిన యువ జనాభా శక్తి గొప్పదని, దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ముందుకు సాగే యువ భారత దేశాన్ని ఎవరూ ఆపలేరని ప్రధాని మోడీ ప్రశంసించారు. శుక్రవారం న్యూఢిల్లీ లోని కరియప్ప మైదానంలో జరిగిన ఎన్‌సిసి ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్‌సిసి గణతంత్ర దినోత్సవాల ముగిం పు సందర్భంగా ఏటా జనవరి 28 న ర్యాలీ జరగడం పరిపాటిగా వస్తుంది. గత రెండేళ్లలో సరిహద్దు ప్రాంతాల్లో లక్షకు పైగా ఎన్‌సిని కేడెట్లు చేరారని, ఇందులో ఎక్కువగా బాలికలను చేర్చుకోవడం గొప్పవిషయంగా ఆయన ఉదహరించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై మాట్లాడుతూ తమ క్యాంపస్‌ల్లో ఇలాంటి వ్యసనం లేకుండా ఎన్‌సిసి అభ్యర్థులు తమకు తాము దూరంగా ఉండాలని దీన్ని మానలేనివారు విముక్తి పొందేలా సహకరించాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీ, సమాచార రంగం తదితర అవకాశాలు విస్తరించే ఈ యుగంలో తప్పడు సమాచారం వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయని, దీనిపై ఎన్‌సిసి కేడెట్లు అవగాహన ఉద్యమాన్ని నిర్వహించాలని సూచించారు.

దేశం స్వయం స్వావలంబన పొందేలా స్థానిక వస్తువులనే వాడాలి (వోకల్ ఫర్ లోకల్) అన్న లక్షంలో కీలక పాత్ర వహించాలని కోరారు. ఒకానొకప్పుడు తాను కూడా ఎన్‌సిసి అభ్యర్థినే అయినందుకు గర్వపడుతున్నానని, ఎన్‌సిసిలో తాను పొందిన శిక్షణ, నేర్చుకున్న విషయాలు , దేశం పట్ల నా బాధ్యతలను నిర్వర్తించడంలో తాను అద్భుతమైన శక్తిని పొందుతున్నానని చెప్పారు. ఎన్‌సిసి గుర్తింపు కార్డు కూడా తాను పొందానని, ఈ ర్యాలీకి ఒక ప్రధానిగా కాకుండా ఎన్‌సిసి పూర్వ విద్యార్థిగా వచ్చానని పేర్కొన్నారు. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం దేశం లోని 90 యూనివర్శిటీలు తమ విద్యార్ధులకు ఎన్‌సిసి ఒక ఎంపిక చేసుకునే ముఖ్యాంశంగా అమలు చేస్తున్నాయని చెప్పారు. ఇక్కడ అనేక మంది బాలికలను తాను చూస్తున్నానని, మనదేశం ఎలా మార్పు చెందుతుందో అని చెప్పడానికి ఇది సంకేతమని తెలిపారు. ఇప్పుడు బాలికలు సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్లు పొందుతున్నారని, ఆర్మీలో మహిళలు ప్రధాన బాధ్యతలు వహిస్తున్నారని ఉదహరించారు. ఎన్‌సిసిలో ఎక్కువ మంది బాలికలు చేరేలా ప్రయత్నించాలని సూచించారు.

Modi attends NCC rally at cariappa ground in delhi