Wednesday, April 24, 2024

చిరు, నాగ్, వరుణ్ తేజ్, సాయి తేజ్‌లకు మోదీ అభినందనలు

- Advertisement -
- Advertisement -

Modi

 

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అయితే మన దేశంలో కరోనా కేసుల పరిస్థితి మిగతా దేశాలతో పోల్చుకుంటే కాస్త తక్కువే అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. అయితే కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్ధతుగా మన టాలీవుడ్ కూడా నిలిచింది. అయితే కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ… ఓ చక్కని సందేశాన్ని పాట రూపంలో అందించారు చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కోటి. సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన ఈ పాటను చిరు, నాగ్, వరుణ్ తేజ్, సాయితేజ్ ఆలపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ పాటను అందించిన చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లను అభినందించారు. “మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు” అంటూ… “అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్‌పై విజయం సాధిద్దాం”అని తెలుగులో ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

కరోనా రహిత దేశం కోసం…
కరోనా వైరస్ నిరోధానికి ఈనెల 14 వరకు దేశంలో లాక్ డౌన్ విధించిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా దేశ ప్రజలకు వీడియో ద్వారా ఓ సందేశాన్ని అందించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్స్‌తో 9నిముషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధాని ఈ సందర్భంగా దేశ ప్రజలను కోరారు. ప్రధాని సందేశంపై స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మోదీ సందేశం మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు అందరం ఇంట్లో ఉన్న లైట్స్ తీసివేసి తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగిద్దాం”అని అన్నారు. “కరోనా రహిత భారతదేశం కోసం ప్రజలలో స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమాన్ని అందరం సక్రమంగా నిర్వహిద్దాం” అని వారు పేర్కొన్నారు.

Modi congratulates Chiru Nag Varun Tej and Sai Tej
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News