Home జాతీయ వార్తలు ప్రధాని మోడీ ఫోనుకు స్పందించని మమతా బెనర్జీ

ప్రధాని మోడీ ఫోనుకు స్పందించని మమతా బెనర్జీ

PM-Modi

ఢిల్లీ: ఫణి తుపాను సృష్టిస్తున్న బీభత్సంపై పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీతో ఫోనులో మాట్లాడడానికి ప్రధాని నరేంద్ర మోడీ రెండు సార్లు ప్రయత్నించారు. అయిన ప్రధాని మోడీ ఆమెతో మాట్లాడడం కుదరలేదని కేంద్ర ప్రభుత్వాధికారి మీడియాకు వెల్లడించారు. దీంతో  ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ గవర్నరు కేసరినాథ్‌ త్రిపాఠీతో మాట్లాడారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాలుగా సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మోడీ తెలిపారు. మమతా బెనర్జీతో మోడీ మాట్లాడడానికి ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది ఆమెకు రెండు సార్లు ఫోన్ చేయగా సిఎం కార్యాలయ సిబ్బంది రెండు సార్లు వేర్వేరు సమధానాలు చెప్పారని ప్రభుత్వాధికారి మీడియాకు వెల్లడించారు.

Modi could not talk to mamata banerjee over Fani Cyclone