Home తాజా వార్తలు కేంద్రానికి పోయేది రూ.2,72,926 కోట్లు…

కేంద్రానికి పోయేది రూ.2,72,926 కోట్లు…

KCR

 

హైదరాబాద్: కేంద్రం విధిస్తున్న వివిధ రకాల పన్నుల ద్వారా గత ఐదేళ్లలో కేంద్రానికి తెలంగాణ నుంచి రూ.2,72,926 కోట్లు అందించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో కెసిఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. అయితే కేంద్రం పథకాల అమలు కోసం మన రాష్ట్రానికి వచ్చిన నిధులు విలువ రూ.31,802 కోట్లుగా ఉందన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.5,37,373 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.1336 కోట్లు ఖర్చుచేస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ.250 కోట్ల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతాయని కెసిఆర్ వెల్లడించారు.

 

Modi Government Take More Funds from Telangana