Thursday, March 28, 2024

నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నగదు చెలామణిని తగ్గించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసింది. కానీ ఆచరణాత్మకలో కేంద్ర ప్రభుత్వం సాధించిందేమీలేదని రిజర్వుబ్యాంక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత పదేళ్లుగా రిజర్వు బ్యాంకు వెలువరించిన వార్షిక నివేదికల్లో కేంద్రం వైఫల్యం స్పష్టమవుతోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా నగదు చెలామణి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. మరోవైపు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమానిటైజేషన్‌పై అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా వార్షిక నివేదికల్లో ప్రచురించిన డేటా, గత పదేళ్లలో దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ నాణేలు) సిఐసి, జిడిపి నిష్పత్తిని కేంద్రం తెలిపింది. నకిలీ కరెన్సీ అరికట్టడం, నల్లధనం వెలికితీత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడం తదితర అంశాల్లోనూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. నకిలీ నోట్ల సమస్య మళ్లీ తీవ్రమైంది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో నకిలీ నోట్లు 10.7శాతం పెరిగాయని ఆర్‌బిఐ నివేదించింది. రూ.2000నకిలీ నోట్లు 54.16శాతంపెరిగాయని గతేడాది నివేదికలో బహిర్గతమైంది.

గత పదేళ్లుగా చెలామణిలో ఉన్న నోట్లు వాటి విలువ

రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికల్లో తెలిపిన వివరాల ప్రకారం గత పదేళ్లుగా చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల పరిమాణం, విలువ (ఎన్‌ఐసి) ఈ విధంగా ఉంది. మార్చి 2013నాటికి కరెన్సీ నోట్లు చెలామణిలో ఉండగా విలువ నివేదించింది. అదేవిధంగా 2014నాటికి నోట్లు చెలామణిలో ఉండగా వీటి విలువ రూ.12,82,900కోట్లు. మార్చి 2015నాటికి 8,35,790 నోట్లు చెలామణీలో ఉంటే విలువ మార్చి 2016నాటికి 9,02,660 నోట్లు విలువ 16,41,500కోట్లు, మార్చి 2017నాటికి 10,02,930నోట్లు వీటి విలువ 13,10,200కోట్లుగా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదించింది.

ఈక్రమంలో మార్చి 2018నాటికి చెలామణిలో ఉన్ననోట్లు 10,23,951కాగా వీటి విలువ మార్చి 2019నాటికి చెలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 10,87,594కాగా వీటి విలువ 21,10,892కోట్లు. మార్చి 2020 నాటికి 11,59,768నోట్లు చెలామణిలో ఉండగా మార్చి 2021నాటికి చెలామణిలో ఉన్ననోట్లు నోట్ల విలువ రూ.28,26,863కోట్లుగా నివేదించింది. మార్చి 13,05,326కోట్లు ఉండగా విలువ రూ.31,05,721కోట్లుగా ఆర్‌బిఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. కాగా ద్రవ్యోల్బణం చెలామణిలో ఉన్న నగదుతో సహా అనేక అంశాలచే ప్రభావితమ వుతుంది. ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ ద్వారాద్రవ్యోల్బణాన్ని రెండుశాతం నుంచి ఆరుశాతం వరకు ఆమోదిత శాతంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. లోక్‌సభ కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించిన వివరాల్లోనూ ప్రభుత్వం డిమోనిటైజేషన్ లక్షం సాధించడంలో విఫలమైందని బహిర్గతమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News